Andhra Pradesh And Telangana Latest News: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటున్న ఆయన పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారు. అమిత్‌షా కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 24న జరిగే నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టబడుల పెట్టే అంశంపై వారితో మాట్లాడతారు.   

Continues below advertisement


ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పదిసార్లుకుపైగా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి కేంద్రం చాలా నిధులు అందిస్తోంది. అయితే ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. వాటిపై చర్చించేందుకు పదే పదే కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా ఈసారి సమావేశంలో కూడా ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంపై వారితో చర్చిస్తారు. 


బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెబుతున్న వేళ వాటిని నివృత్తి చేసి అనుమతులు తెచ్చుకునే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నారు. అందుకే ఈ ప్రాజెక్టు అంశంపై ఈ పర్యటనలో క్లారిటీ తీసుకురానున్నారు. మరికొన్ని పెండింగ్ ఇష్యూలపై కూడా కేంద్రమంత్రులతో చర్చిస్తారు. అదే టైంలో అమిత్‌షాతో సమావేశమై రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఉగ్రవాదులకు సాయం చేస్తున్న వారిపై ఉక్కపాదం మోపడంపై చర్చించనున్నారు. 


ఈ సమావేశంలోలనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నా వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో విదేశీ వ్యాపారవేత్తలు కూడా  పాల్గొంటున్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబుడులు పెట్టాలి, ఇస్తున్న ఫెసిలిటీస్‌ ఏంటో వివరిస్తారు. ఇలా సమావేశమయ్యే వారిలో ఆపిల్ ప్రతినిధులు కూడా ఉన్నారు. 
మొదటి రోజులు ఈ సమావేశాలు అయిన తర్వాత 24వ తేదీ రెండో రోజు నీతి ఆయోగ్ పాలకమండలి భేటీలో పాల్గొంటారు. ఈ నీతి ఆయోగ్ పాలకమండలి భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన కూడా కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకేసారి ఢిల్లీలో పర్యటిస్తుండటం ఆసక్తిగా మారింది.