How to do Sundarakanda Parayana

సమస్యలేని వ్యక్తి ఉండరుపరిష్కారం లేని సమస్య ఉండదుసమస్యకు పరిష్కారం చూపించి ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే హనుమాన్ ని భక్తిశ్రద్ధలతో పూజించాలి అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. 

కష్టం వచ్చినప్పుడు హనుమంతుడి ఆలయానికి వెళ్లో, ఆవిగ్రహాన్ని ఎదురుగా పెట్టుకునో పూజించాల్సిన అవసరం లేదు. మీరు కూర్చున్న ప్రదేశంలో జై హనుమాన్ అని రాసి భక్తితో నమస్కరిస్తే చాలు..బయటపడలేం అనుకునే సమస్య నుంచి గట్టెక్కిపోతారు. 

ఇప్పుడేం చేయాలి - ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలి అనే సందర్భం మీ జీవితంలో ఎదురైతే.. ఆక్షణం సుందరకాండ ఎదురుగా పెట్టుకుని అందులో ఓ పేజీని అంచనాగా ఓపెన్ చేసి చూడండి..అక్కడున్నదే మీకు లభించే పరిష్కారం  ఇక అందరూ భయపడేది శని బాధలకే. ఎల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం లభించాలంటే సుందరకాండలో 48వ సర్గ పారాయణం చేస్తే చాలు.. ఆ ప్రభావం నుంచి బయపడతారు

సుందరకాండలో 48వ సర్గ ఇదే

స బద్ధస్తేన వల్కేన విముక్తోఽస్త్రేణ వీర్యవాన్ |అస్త్రబంధఃస చాన్యం హి నబంధమనువర్తతే||  

 సుందరకాండలో ఏ శ్లోకం చదివితే ఎలాంటి ఫలితం వస్తుందంటే...

లంకా విజయం -  భయాందోళనలు తొలగిపోతాయి

హనుమ నిర్వేదం -  బుద్దిమాంద్యం సమస్య తొలగిపోతుంది

లంకలో సీతాన్వేషణ ఘట్టం - నిందలు తొలగిపోతాయి

లంకలో సీతమ్మను హనుమ చూసిన ఘట్టం -  ఐశ్వర్యం

త్రిజటా స్వప్న వృత్తాంతం  - చెడు కలలు రావు

సీతారావణ సంవాదం  -  మంచి బుద్ధి కలుగుతుంది

సీతా హనుమ సంవాదం - దూరమైన బంధువుల కలయిక

అంగుళీయక ప్రదానం - కష్టాలు తొలగిపోతాయి

కాకానుగ్రహం - తెలిసీ తెలియక చేసిన తప్పులు పోతాయి

చూడామణి ప్రదానం - బ్రహ్మజ్ఞానం కలుగుతుంది

రాక్షసులను హనుమ వధించిన ఘట్టం - శత్రువుల మీద విజయం 

లంకాదహన ఘట్టం - ఇంట్లోనూ, వ్యవసాయ పనుల్లో అభివృద్ధి 

మధువన ధ్వంసం - మరణానంతరం  బ్రహ్మలోకానికి వెళతారు

సీతా సందేశాన్ని రాముడికి నివేదించడం - అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి

అంగుళీయక ప్రదానం -  చేపట్టిన పనుల్లో విజయం  

నిత్యం సుందరకాండ పారాయణం చేస్తే పెళ్లికానివారికి వివాహయోగం, ఉత్తమ భాగస్వామి దొరుకుతారు

సుందరకాండను 68 రోజుల పారాయణం చేస్తే సంతానలేమి సమస్య పరిష్కారం అవుతుంది, అన్నింటా విజయం సిద్ధిస్తుంది

రామాయణంలో ఏడుకాండల్లో అత్యంత విశిష్టమైనది  సుందరకాండ.  హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకుని, సీతాదేవిని వెతికి, రాముడి దూతగా పరిచయం చేసుకుని, ఆ తర్వాత తనను బంధించాలని చూసిన లంకకు నిప్పు పెట్టి..అక్కడి నుంచి రామచంద్రుడిని చేరుకుని సీతాదేవి సమాచారం అందిస్తాడు. ఈ మొత్తం  సారాంశమే సుందరకాండ. ఇందులో ప్రతి పదం, ప్రతి ఘట్టం, ప్రతి సన్నివేశం సుందరమే. ఆనందమే. అందుకే సుందరకాండ చదివినా, విన్నా సకల సమస్యలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని చెబుతారు.

ఎదిగే కొద్ది ఒదిగి ఉండడం అంటే ఎలా? హనుమంతుడిని నుంచి మనం ఏ నేర్చుకోవాలి? సుందరకాండ ఎందుకంత ప్రత్యేకం? తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

శని జయంతి రోజు ఈ వస్తువుల దానం మీకు అభివృద్ధిని అందిస్తుంది - అవేంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.