22 మే 2025 మీ రాశిఫలితం మేష రాశి (Aries)- 22 మే 2025
మేష రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. పనుల విషయంలో మానసికంగా బలంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల వల్ల మీ గౌరవం పెరుగుతుంది. మీ పనితీరుకి ప్రశంసలు లభిస్తాయి. కష్టపడి చేసిన పనిలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మీ ప్రణాళికల వల్ల వ్యాపారం విజయవంతమవుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఖర్చులు పెరగవచ్చు జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎవరితోనూ గొడవ పడకండి. దాంపత్య జీవితం ఏదైనా విషయంపై ఒత్తిడికి గురవుతారు. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది.
వృషభ రాశి (Taurus)- 22 మే 2025
వృషభ రాశివారికి ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. మీ మీద మీరు చాలా శ్రద్ధ వహిస్తారు. కుటుంబ జీవితం బాగుంటుంది. ప్రేమ జీవితం ఉన్నవారికి రోజు ఆనందంగా ఉంటుంది. కొన్ని మానసిక ఆందోళనలు కచ్చితంగా ఉంటాయి, వాటిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అదృష్టం బలంగా ఉంటుంది కానీ కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యంలో ఇబ్బందులు రావచ్చు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితాలు సానుకూలంగా ఉంటాయి.
మిథున రాశి (Gemini)- 22 మే 2025
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో ఉన్న ప్రతిష్టాత్మక వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి, అవి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది జాగ్రత్త వహించండి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది. ప్రియమైనవారితో ఉండే పాత అపోహలు తొలగిపోతాయి. వివాహితులు తమ దాంపత్య జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. పని విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి (Cancer)- 22 మే 2025
కర్కాటక రాశి వారు ఈ రోజు సవాళ్లు ఎదుర్కొనే ధైర్యంతో ఉంటారు. పని ప్రదేశంలో మీరు ప్రత్యర్థులను జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని ఉండవచ్చు. దాంపత్య జీవితం విషయంలో భర్త-భార్యల సంబంధం బలంగా ఉంటుంది. ప్రేమ జీవితం బావుంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది
సింహ రాశి (Leo)- 22 మే 2025
సింహ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం , దినచర్య విషయంలో మార్పులు వద్దు. మానసికంగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మిగిలిన రోజులతో పోలిస్తే ఈ రోజు కొంత బావుంటుంది. అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన పనిలో మంచి ఫలితాలు పొందుతారు.
కన్యా రాశి (Virgo)- 22 మే 2025
ఈ రాశివారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలపై చాలా శ్రద్ధ వహిస్తారు. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. వివాహితుల రోజు బాగుంటుంది, కానీ జీవిత భాగస్వామితో ఏదైనా విషయంపై కోపంగా ఉండవచ్చు. ప్రేమ జీవితం ఉన్నవారు తమ భాగస్వామితో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనిలో నైపుణ్యం కారణంగా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు
తులా రాశి (Libra)- 22 మే 2025
తులా రాశి వారికి ఈ రోజు భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంపై కొంత శ్రద్ధ వహించాలి. పని ప్రదేశంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ప్రవర్తించండి. జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది
వృశ్చిక రాశి (Scorpio)- 22 మే 2025
ఈ రాశివారికి ఈ రోజు రేపు లాభదాయకంగా ఉంటుంది. పని ప్రదేశంలో బాధ్యతలను చాలా బాగా నిర్వహిస్తారు కానీ ఏదైనా విషయంపై ఆందోళన చెందుతారు. ఉద్యోగంలో మీకు ప్రశంసలు లభిస్తాయి . అధికారులు మీకు సహాయం చేస్తారు. వ్యాపారంలో ప్రత్యర్థులపై మీరు గెలుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది, దీని వల్ల వివిధ రకాల పనుల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి (Sagittarius)- 22 మే 2025
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంత భావోద్వేగంగా ఉంటారు. మీ మాటతీరువల్ల కుటుంబంలో గొడవలు జరగవచ్చు జాగ్రత్తగా ఉండండి. దాంపత్య జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ భాగస్వామి ప్రతి విషయాన్ని చాలా ఎక్కువగా పట్టించుకుంటారు..ఇది మీకు సమస్యగా మారుతుంది. పని విషయంలో మంచి ఫలితాలను పొందడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.
మకర రాశి (Capricorn)- 22 మే 2025
మకర రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ గౌరవం పెరుగుతుంది. మీరు ఏదైనా విషయంపై ఆందోళన చెందుతున్నట్టైతే ఈ రోజు బయటపడేందుకు ప్రయత్నించండి. లేదంటే అనారోగ్యం పాలవుతారు. ప్రేమ జీవితం, వైవాహిక జీవితం బావుంటుంది. వివాహితుల గృహ జీవితంలో రేపు ఆనందకరమైన క్షణాలు వస్తాయి
కుంభ రాశి (Aquarius)- 22 మే 2025
కుంభ రాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం బలహీనంగా ఉండటం వల్ల ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయం మిమ్మల్ని బలపరుస్తుంది. ప్రేమ జీవితానికి రోజు బాగుంటుంది. పని ప్రదేశంలో కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు, వాటిలో అధికారుల సహాయం లభిస్తుంది. వివాహితుల జీవితంలో ఆనందం పెరుగుతాయి. జీవిత భాగస్వామి వల్ల పెద్ద ప్రయోజనం ఉండవచ్చు.
మీన రాశి (Pisces)- 22 మే 2025
ఈ రోజు మీకు బావుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పని విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ వాతావరణం ఒత్తిడిని కలిగించవచ్చు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. సోదరులతో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించే ప్రణాళికను రూపొందించవచ్చు.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.