Chandrababu Naidu :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్రపై జగన్ చేసిన విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు.   యోగాంధ్ర కార్యక్రమం ఇంత భారీ త్తున  ప్రజల డబ్బు వృథా చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.  కొన్ని సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడటం కూడా అనవసరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కలుషితం చేసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని  స్పష్టం చేశారు.  ఇలాంటి భూతాన్ని  ఎలా నియంత్రించాలో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తామని తెలిపారు.  

Continues below advertisement


యోగాంధ్ర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించిందని  ..కేంద్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించిందని చంద్రబాబు తెలిపారు.  ప్రజల శ్రేయస్సు కోసమే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.  ప్రజల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో మేలు చేస్తుందని, అలాంటి కార్యక్రమాలపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సలహా ఇచ్చారు. 


రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా చేయడంపై సీఎం చంద్రబాబు అధికారుల్ని అభినందించారు. విశాఖలో అధికారులతో సమావేశమై కార్యక్రమం జరిగిన తీరుపపై సమక్షించారు.   ప్రజల సహకారం, వారి క్రియాశీల భాగస్వామ్యం, అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని  చంద్రబాబు సంతృప్తి వ్యక్ంత చేశారు.  ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో ఇది గొప్ప ముందడుగు అన్నారు.  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంలోనూ, పలు ప్రపంచ రికార్డులు సాధించడంలోనూ కీలక పాత్ర పోషించిన మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. 


మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాలను విజయవంతం చేశారన్నారు.  యోగా దినోత్సవం రోజున అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు కార్యక్రమ స్థలాలకు తరలిరావడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని.. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో 3 లక్షల మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా యోగా సాధనలో పాల్గొనడంపై ప్రజల్లో వచ్చిన ఆరోగ్య స్పృహకు నిదర్శనంగా భావిస్తున్నారు.  యోగాంధ్రలో  కార్యక్రమంలో పాల్గొన్న వారి సంఖ్యను కచ్చితంగా లెక్కించేందుకు ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని  సాంకేతిక పరిజ్ఞానంతో హాజరు లెక్కింపు పక్కాగా జరిగిందని  ..దాని వల్లే గిన్నిస్ రికార్డు సులువు అయిందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. 


11వ అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని చంద్రబాబు తెపిరారు.  . గేమ్ ఛేంజర్‌గా నిలిచిన ఈ వేడుకకు ఓ లాజికల్ ముగింపు ఇస్తామని చెప్పారు.  యోగా కుటుంబానికి భారం కాదని.. రాష్ట్రానికి భారం కాదని పెద్ద ఎత్తున యోగాంధ్రను ప్రోత్సహిస్తామని చెప్పారు. డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి నూతన ఒరవడిలు సృష్టిస్తున్నామన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుతూ వైద్య ఖర్చులు బాగా తగ్గేలా ఈ ప్రాజెక్టు రూపొందుతోందన్నారు.