Mahindra Scorpio-N Price And Features In Telugu: మహీంద్రా & మహీంద్రా, ఇటీవలే, భారతదేశంలో తన పాపులర్‌ SUV స్కార్పియో-N సిరీస్‌లో Z4 ట్రిమ్ ఆటోమేటిక్ వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. గతంలో, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్ Z6 & Z8 ట్రిమ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు కస్టమర్లు Z4 ట్రిమ్‌లోనూ ఆటోమేటిక్‌ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

Z4 పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్‌ ధర (Mahindra Scorpio-N ex-showroom price) దాదాపు రూ. 17 లక్షలు. డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్ ధర దాదాపు రూ. 18 లక్షలు. ఈ ధర Z6 ట్రిమ్ కంటే దాదాపు 1 లక్ష రూపాయలు చవక. హుందాగా కనిపించే & అద్భుతమైన ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ SUVని బడ్జెట్‌ రేటులోనే కొనాలనుకునే కస్టమర్లకు ఈ వేరియంట్ ఒక మంచి అవకాశం లాంటిది.

ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌రెండు ఇంజిన్ ఆప్షన్స్‌లో Z4 ఆటోమేటిక్‌ వేరియంట్‌ అందుబాటులో ఉంది. మొదటి ఆప్షన్‌ - 2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 203 PS పవర్‌ను & 380 Nm టార్క్ (ఆటోమేటిక్ వెర్షన్‌లో) ఇస్తుంది, ఆక్సిలేటర్‌ తొక్కిపడితే తుపాకీ తూటాకు కూడా దొరకదు. ఈ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పని చేస్తుంది. రెండో ఆప్షన్‌ - 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజన్, ఇది రియర్‌-వీల్‌ డ్రైవ్‌లో 132 PS పవర్‌ను & 300 Nm టార్క్‌ను ఇస్తుంది. అదే సమయంలో, దీని ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ (4WD) వెర్షన్ (Z4 E) 175 PS పవర్‌ను & 370 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. అయితే, ఇది ప్రస్తుతం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.      

కొత్త స్కార్పియో-N Z4 ట్రిమ్‌ ఫీచర్లుZ4 వేరియంట్‌లో అడ్వాన్స్‌డ్‌ & రోజువారీ అవసరాలను తీర్చే చాలా ఫీచర్లు (Mahindra Scorpio-N Price Features) ఉన్నాయి. క్యాబిన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. ఇంకా... మల్టీఫంక్షన్ స్టీరింగ్ కంట్రోల్, రియర్ AC వెంట్స్, హాలోజన్ హెడ్‌లైట్లు, LED టర్న్ ఇండికేటర్లు, 17-అంగుళాల స్టీల్ వీల్‌, రియర్ స్పాయిలర్, పవర్ విండోస్ & ఫాబ్రిక్ సీట్‌ కవర్స్‌ ఏర్పాటు చేశారు.               

భద్రతసేఫ్టీ పరంగానూ (Mahindra Scorpio-N Price Safety Features) Z4 ట్రిమ్‌పై శ్రద్ధ పెట్టారు. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ABS & EBD, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ & త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్‌ వంటి సేఫ్టీ ఫీచర్లను ఈ SUVలో చూడవచ్చు.            

బుకింగ్స్‌ & డెలివెరీదేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా డీలర్‌షిప్స్‌ ఈ వేరియంట్ కోసం బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి & కంపెనీ త్వరలో డెలివరీలు ప్రారంభించవచ్చు.