Pm Modi Performs yoga in Vizag | విశాఖపట్నం: యోగా కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందని, యోగాకు వయసుతో పనిలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, యోగా చేయడం ద్వారా యుద్ధాలు సైతం ఆగిపోతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగాను అనుసరిస్తున్నారు. ప్రపంచానికి భారత్ అందించిన విలువైన కానుక యోగా అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం విశాఖపట్నంలో నిర్వహించిన భారీ యోగా కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ప్రధాని మోదీతో పాటు ఏపీ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, పలువరు రాష్ట్ర మంత్రులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఒక స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.

మంత్రి లోకేష్‌కు అభినందనలు

యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలిపాయి. కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిన సాధనం యోగా. ప్రకృతి, ప్రగతి సమ్మేళనంలా ఉంది విశాఖపట్నం. యోగాడే నిర్వహణపై మంత్రి నారా లోకేష్ కృషిని ప్రత్యేకంగా అభినందినలు. యోగాపై రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి నారా లోకేష్ చైతన్యం కల్పించారు. ఎంతో విశిష్టమైన యోగాంధ్ర నిర్వహణకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చొరవ చూపారు. ప్రపంచంతో మనం అనుసంధానం కావడానికి యోగా ఉపయోగపడుతుంది

ప్రపంచం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటోంది. యోగా చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పవచ్చు. యోగాలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర అద్భుతం. 175 దేశాల్లో యోగా చేయడం మామూలు విషయం కాదు. కోట్లాది మంది జీవన గతిని యోగా మార్చింది. భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాల క్షేమాన్ని కోరుకుంటోంది. వన్ ఎర్త్.. వన్ హెల్త్ యోగా లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం చాలా గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉంది. ఏపీ ప్రజలకు అభినందనలు’ తెలిపారు. ప్రధాని మోదీ

చరిత్ర సృష్టించిన వైజాగ్ యోగా డే వేడుకలు - యోగా డేలో పాల్గొన్న 2.72 లక్షల మంది - సూరత్‍ లో 1,47,952 మంది యోగా రికార్డు బ్రేక్ - బీచ్ రోడ్‍లో 26.8 కిలోమీటర్ల పొడవున యోగా - విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగా

ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు మరియు ఒలింపిక్ క్రీడలలో యోగాను చేర్చడానికి తన కార్యాలయాలను ఉపయోగించాలని ఆయన ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరారు. "యోగాలో వివిధ అంశాలలో ప్రపంచ పోటీ ప్రారంభమైంది. సెప్టెంబర్లో యోగా సూపర్ లీగ్ ప్రారంభం కావడం నాకు సంతోషంగా ఉంది" అని ముఖ్యమంత్రి అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ భారీ యోగా దినోత్సవంలో విశాఖపట్నం నగరంలోని ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌లో 3 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి భారతదేశం ఒక తీర్మానాన్ని సమర్పించిన రోజును ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. "చాలా తక్కువ సమయంలో, ప్రపంచంలోని 175 దేశాలు మన దేశంతో కలిసి వచ్చాయి. నేటి ప్రపంచంలో ఈ ఐక్యత, మద్దతు సాధారణ విషయం కాదు" అని ఆయన అన్నారు. 

"యోగా మనకు శాంతిని ఇస్తుంది. యుద్ధాలకు చెక్ పెట్టే ఆయుధంగా యోగా పనిచేస్తుంది. మానవాళి మధ్య నెలకొన్న అశాంతికి యోగా ఒక విరామ బటన్" అని ప్రధాని మోదీ అన్నారు.