ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్ ఫలితాల(AP EdCET Results 2025)ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 99.42 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరిక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 17, 795 మంది పరీక్ష రాయగా ఇందులో 14,527మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspxలో ఉంచారు.
బీఈడీ రిజల్ట్స్‌ను ఎలా చెక్ చేసుకోవాలిఆంధ్రప్రదేశ్‌లో బీఈడీ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిని చూడటానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspxను సందర్శించాలి. అక్కడ కుడివైపు రిజల్ట్స్ అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయాలి. దాని పక్కనే డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డు ఉంటుంది. ముందు రిజిల్ట్స్‌పై క్లిక్ చేయాలి. వెంటనే రిజల్ట్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేయాలి. తర్వాత ఎడ్‌సెట్ హాల్ టికెట్ నెంబర్ రాయాలి. తర్వాత మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఫలితాలు చూసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవాలి. కౌన్సెలింగ్ టైంలో అవసరం అవుతుంది. మీరు ర్యాంక్ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రింట్ అవుట్ కూడా తీసుకోవాలి.
2025 సంవత్సరానికి సంబంధించిన ఎడ్‌సెట్ పరీక్షను ఆచార్య నాగర్జున యూనివర్సిటీ నిర్వహించింది. జూన్ ఐదో తేదిన పరీక్ష నిర్వహించారు. ఈ మధ్యే ఫైనల్ కీ కూడా విడుదల చేశారు. ఇందులో మంచి ఫలితాలు సాధించిన అభ్యర్థులకు బీఈడీ, స్పెషల్ బీఈడీ కళాశాలల్లో చేరబోతున్నారు.