Sperm Donation Process In India:టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు వీర్యదానంతో వంద మందికిపైగా పిల్లల జననానికి కారణమయ్యారు. తన ఆస్తిని వాళ్లకు రాసేశారు. అయితే ఎవరైనా వీర్యదాతగా మారొచ్చా. ఇండియాలో అలాంటి వాటికిఅవకాశం ఉంటుందా అనే అనుమానం చాలా మందిలో ఉంది. వాటికి సమాధానం ఇక్కడ తెలుసుకోండి.
స్పెర్మ్ దానం చేయాలనుకుంటే, మీరు మొదట సర్టిఫైడ్ స్పెర్మ బ్యాంకు లేదా ఫర్టిలిటీ క్లినిక్‌ని సంప్రదించాలి. ఇవి ప్రధానంగా పెద్ద నగరాల్లో లేదా యూనివర్శిటీ ఆసుపత్రుల్లో ఉంటాయి. భారతదేశంలో స్పెర్మ్ దానం చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 21-55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్లు మాత్రమే స్పెర్మ్ దానం చేయాలి. ఇలా స్పెర్మ్ దానం చేసే వాళ్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. కుటుంబ హెల్త్ హిస్టరీని కూడా చెక్ చేస్తారు. ఏదైనా జన్యు లేదా అంటువ్యాధులు ఉన్నాయో లేదో చెక్ చేస్తారు.
ఇండియాలో స్పెర్మ్ దానం చేయవచ్చా?
ఇండియాలో స్పెర్మ్ దానం చేయవచ్చు. కానీ ఈ ప్రక్రియను నియంత్రించేందుకు ఒక ప్రత్యేక చట్టం ఇంకా రూపొందలేదు. భారత వైద్య పరిశోధన మండలి (ICMR) 2005, 2017లో సహాయక పునరుత్పత్తి సాంకేతికత (ART) క్లినిక్‌ల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు స్పెర్మ్ దానం ప్రక్రియ నియంత్రించడానికి పనిచేస్తాయి. 2021లో సహాయక పునరుత్పత్తి సాంకేతికత (ART) బిల్‌ను పార్లమెంట్ పరిగణనలోకి తీసుకున్నా, ఇంకా చట్టంగా మారలేదు. ఈ బిల్ ఆమోదం పొందితే స్పెర్మ్ దానం గురించి మరింత స్పష్టత వస్తుంది.
స్పెర్మ్ దానానికి నియమాలు
స్పెర్మ్ దానం చేయాలంటే కొన్ని నియమాలను పాటించాలి. ICMR మార్గదర్శకాల ప్రకారం, దానం చేసే వ్యక్తి కింది అర్హతలు ఉండాలి.
వయస్సు: దానం చేసే వ్యక్తి వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆరోగ్యం: ఆరోగ్యంగా ఉండాలి. ఎటువంటి అంటువ్యాధులు (HIV, హెపటైటిస్ B, C, సిఫిలిస్) లేదా వారసత్వ రోగాలు ఉండకూడదు.
స్క్రీనింగ్: దానం చేసే ముందు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, మానసిక ఆరోగ్య పరీక్షలు చేయాలి.
సమ్మతి: దానం చేసే ముందు వ్యక్తి, వైద్య క్లినిక్ మధ్య ఒప్పందం ఉండాలి. ఇందులో వీర్య దాతకు పుట్టి పిల్లలపై ఎటువంటి హక్కులు లేవని స్పష్టంగా రాసి పెట్టుకోవాలి.
స్పెర్మ్ దానం చేసే వ్యక్తి ఒక్కసారి మాత్రమే దానం చేయాలని ART బిల్ 2021 సూచిస్తోంది. దీని ద్వారా అదే వ్యక్తి నుంచి ఎక్కువ పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది, ఇది రక్త సంబంధాలు సమస్యలను నివారిస్తుంది. దానం చేసే వ్యక్తి గురించి వివరాలు బయటకు తెలియకూడదు. కానీ క్లినిక్ ఆ వ్యక్తి వివరాలను 40 సంవత్సరాలు గోప్యంగా ఉంచారు. దానం చేసిన తర్వాత పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత దానం చేసిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉండవచ్చు, కానీ ఇది ఇంకా స్పష్టంగా నిర్ణయం కాలేదు.
స్పెర్మ్ దానం ప్రక్రియ
స్పెర్మ్ దానం చేయడం కోసం కొన్ని దశలు ఉన్నాయి. మొదట వ్యక్తి నమోదైన స్పెర్మ్ బ్యాంక్ లేదా ART క్లినిక్‌కు వెళ్లాలి. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేస్తారు, ఇందులో రక్త పరీక్షలు, సీమెన్ పరీక్షలు, జన్యు రోగాల కోసం పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా రోగాలు ఉన్నాయో లేదో నిర్దారిస్తాయి. అర్హత సాధించిన తర్వాత ఆయనకు ఒక రూం ఇచ్చి సీమెన్ నమూనాను సేకరించడానికి అవకాశం ఇస్తారు. ఈ నమూనా కనీసం 180 రోజుల పాటు భద్రపరుస్తారు. ఆ తర్వాత మరోసారి పరీక్షలు చేసి ఆరోగ్యకరంగా ఉందని ధృవీకరిస్తారు.
దానం చేసిన తర్వాత, ఆ వ్యక్తికి డబ్బులు చెల్లిస్తారు. ఈ డబ్బు వైద్య పరీక్షల ఖర్చులు, ట్రావెల్ ఖర్చులు, టైం కోసం ఇస్తారు. ICMR మార్గదర్శకాల ప్రకారం, దానం చేసే వ్యక్తికి పిల్లలపై ఎటువంటి హక్కులు లేవు.
చట్టాలు మార్గదర్శకాలు
ICMR మార్గదర్శకాలు స్పెర్మ్ దానం కోసం ART క్లినిక్‌లు, స్పెర్మ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట ప్రమాణాలను పాటించాలి. క్లినిక్‌లు దానం చేసే వ్యక్తి గురించి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. దానం తర్వాత ఆ వివరాలను 40 సంవత్సరాలు సీక్రెట్‌గాఉంచాలి. ART బిల్ 2021 ప్రకారం దానం చేసే వ్యక్తి ఒక్కసారి మాత్రమే దానం చేయాలి. ఇది వాణిజ్య రూపంలో మారకుండా జాగ్రత్త పడాలి.
ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారం, స్పెర్మ్ దానం వ్యాపార నిమిత్తం చేస్తే నేరం. దానం చేసే వ్యక్తి ఒక స్పెర్మ్ బ్యాంక్ ద్వారా మాత్రమే దానం చేయాలి. స్వయంగా ఎవరికైనా ఇవ్వడం నిషేధం. ఈ చట్టాలు దానం చేసే వ్యక్తి, దానం తీసుకునే వ్యక్తి రక్షణ కోసం ఉన్నాయి.
ప్రయోజనాలు అండ్ సవాళ్లు
స్పెర్మ్ దానం ద్వారా అనేక దంపతులు సంతానం పొందే అవకాశం ఉంది. ఇది ఒక అనుకూలమైన చర్యగా పరిగణిస్తున్నారు. ఒక వ్యక్తి దానం చేస్తే, దాని ద్వారా ఒక కుటుంబం సంతోషంగా ఉంటుంది. అయినా ఈ ప్రక్రియలో రక్షణ, గోప్యత కోసం కఠినమైన నియమాలు అవసరం. ఇదే ఇప్పుడు ఈ విధానంలో ఉన్న సవాల్. దానం చేసే వ్యక్తి తన గురించి ఎప్పటికీ ఎవరికీ తెలియకుండా ఉండాలనే నిబంధన కఠినంగా అమలు కాకపోవచ్చు.