Chandrababu Phone Call to YS Jagan Mohan Reddy: ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కాల్ చేశారు. రేపు (జూన్ 12) చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నందున ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం కోసం చంద్రబాబు ఈ ప్రయత్నం చేశారు. జగన్‌తో ఫోన్‌లో మాట్లాడి స్వయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే, చంద్రబాబు చేసిన ఫోన్ కాల్‌కు జగన్ మోహన్ రెడ్డి స్పందించలేదని తెలిసింది.


ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటిదాకా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కూటమి పార్టీ తుపాను ధాటికి వైఎస్ఆర్ సీపీ చిగురుటాకులా వణికిపోయింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీనే సొంతంగా 135 సీట్లు గెలిస్తే.. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోనూ విజయఢంకా మోగించింది. బీజేపీ ఎన్నడూ లేని విధంగా 8 సీట్లు గెల్చుకోగలిగింది. ఇక అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ సీపీ కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 


అంతకుముందు 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం రేపింది. సరిగ్గా ఐదేళ్ల పాలన ముగిసేసరికి అదే జగన్ పార్టీకి ప్రజలు అత్యంత దారుణమైన పరాజయాన్ని అప్పగించారు.