David Warner: పుష్ప సైల్లో డేవిడ్‌ వార్నర్‌ యాడ్ - అల్లు అర్జున్‌ రియాక్షన్‌ చూశారా..!

Allu Arjun Reacts on Warner Pushpa Ad: పుష్ప స్టైల్లో డేవిడ్‌ వార్నర్‌ నటించిన యాడ్‌పై ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్పందించాడు. ఆ ప్రకటనకు సంబంధించిన పోస్ట్‌ బన్నీ ఊహించని కామెంట్‌ చేశాడు.

Continues below advertisement

Allu Arjun Cooment on David Warner Pushpa Ad: ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. ఆయన స్టార్‌ క్రికెటర్‌ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌ కూడా. క్రికెటర్‌గా టోర్నమెంట్స్‌తో ఎంత బిజీగా ఉన్నా వీలు చిక్కినప్పుడల్లా సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రిల్స్‌ షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంటారు. ఇక వార్నర్‌ చేసే రిల్స్‌లో తెలుగు సినిమాల సీన్స్‌, డ్యాన్స్‌ స్టెప్పులు ఉండటం విశేషం. అందులోనూ ఎక్కువగా అలల్ఉ అర్జున్‌ పుష్ప పాటలకే రీల్స్‌ చేసి తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు.

Continues below advertisement

లాక్‌డౌన్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో రిల్స్‌ షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. అప్పట్లో ఆయన చేసిన 'పుష్ప: ది రైజ్‌' హుక్‌ స్టేప్స్‌, సిగ్నేచర్‌ స్టెప్స్‌, ఫన్నీ స్పూఫ్‌లు బాగా ఆకట్టుకున్నాయి. అచ్చం పుష్ప రాజ్‌లా గెటప్‌ వేసి పాటలు, వీడియోలు, డైలాగ్స్‌పై వీడియోలు చేస్తూ షేర్‌ చేసేవారు. దీంతో ఆయన వీడియో బాగా వైరల్‌ అయ్యాయి. ఇక ఇప్పుడు ఏకంగా పుష్పపై ప్రకటనే చేశారు వార్నర్‌. ఇటీవల ఆయన ఓ ప్రకటనలో నటించారు. ఇందులో పుష్పరాజ్‌ను ఫాలో అయ్యారు ఆయన. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియో వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన. ఓ మ్యాట్రిక్స్‌ కంపెనీ కోసం చేసిన ఈ ప్రకటనలో వార్నర్‌, అల్లు అర్జున్‌ 'పుష్ప'లోని ఫైర్‌ అనే డైలాగ్‌తో మెప్పించారు.

"డెవిడ్‌ పేరు వినగానే పర్యాటకులకు నాలో పైర్‌ ఉందని తెలిసిపోతుంది. కానీ ఆ ఫైర్‌ని కూల్‌ చేసేది @wakefitco మ్యాట్రిక్స్‌ మాత్రమే" అంటూ సాగిన ఈ ప్రకటనలో డెవిడ్‌ వార్నర్‌ పుష్పరాజ్‌లా దర్శనం ఇచ్చారు. ఇక ప్రకటనపై అసలైన పుష్పరాజ్‌ స్పందించారు. ఆయన పోస్ట్‌కు బన్నీ పడిపడి నవ్వారు. తన రియాక్షన్‌ని ఎమోజీలో రూపంలో తెలియజేశాడు. పడి పడి నవ్వుతున్న ఎమోజీలను కామెంట్స్‌లో సెక్షన్‌లో పోస్ట్‌ చేశాడు. అంతేకాదు థమ్సప్‌ సింబల్‌ ఇచ్చాడు. ప్రస్తుతం డేవిడ్‌ పుష్ప యాడ్‌పై బన్నీ రియాక్షన్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది.  


కాగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2021 డిసెంబర్‌లో రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అప్పుట్లో ఈ సినిమాలోని పాటలు, సిగ్నెచర్‌ స్టెప్పులు సోషల్‌ మీడియాలో మారుమోగాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ 'పుష్ప:ది రూల్‌' వస్తుంది. ఆగస్ట్‌ 15న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో పుష్ప 2 నుంచి వస్తున్న అప్‌డేట్స్‌ రికార్ట్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నుంచి టీచర్‌ వరకు ప్రతి అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఇటీవల రిలీజైన సూసేకి అగ్గి రవ్వ మాదిరే ఉంటాడే నా సామి పాట అయితే యూట్యూబ్‌ను షేక్‌ చేస్తుంది. ఎక్కడ చూసి ఇదే పాట వినిపిస్తుంది. సోషల్‌ మీడియా మొత్తం ఈ పాటే మారుమోగుతూ ట్రెండింగ్‌లో నిలుస్తుంది. పుష్ప ఫస్ట్‌పార్ట్‌ లాగే సెకండ్‌ పార్ట్‌ కూడా విడుదలకు ముందే రికార్డు సెట్‌ చేస్తుంది. మరి రిలీజ్‌ అయ్యాక ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Also Read: నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంట విడాకుల రచ్చ - భార్యకు మరో వ్యక్తితో ఎఫైర్, యంగ్‌ హీరో తీవ్ర ఆరోపణలు

Continues below advertisement