Chandrababu discussed many issues with Prime Minister Modi :  పోలవరం ప్రాజెక్టు విషయంలో  వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని నిధులు విడుదల చేయాలని ప్రధానమంత్రి మోదీని ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తోంది. ప్రధానితో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రానికి రుణ పరిమితి పెంచడంతో పాటు రాజధానికి ఇప్పిస్తామన్న పదిహేను వేల కోట్ల నిధుల గురించి.. ఇతర గ్రాంట్ల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది.  జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పులను రీషెడ్యూల్ చేయాలని ఏపీ ప్రభుత్వం  ఇటీవలి కాలంలో ప్రధానంగా కోరుతోంది. ఈ అంశంపైనా ప్రధాని మోదీకి నివేదిక ఇచ్చినట్లుగా చెబుతున్నారు. 


ఏపీలో మరో 7 విమానాశ్రయాలు, 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి: రామ్మోహన్‌ నాయుడు


ఏపీ అర్థిక  పరిస్థితిపై మరోసారి ప్రధానితో చంద్రబాబు చర్చ        


గత ఐదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది. ఈ క్రమంలో  ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టుకోవాలంటే కేంద్ర సాయం అవసరమని భావిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు పెట్టింది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది . బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో టీడీపీ మద్దతు కీలకం. అందుకే టీడీపీ కీలక ప్రయోజనాలను సాధించుకుంటోందన్న అభిప్రాయం జాతీయ రాజకీయాల్లో ఉంది.  బడ్జెట్‌లో బీహార్తో పాటు ఏపీకి  మంచి ప్రయోజనాలు కల్పించారని రాజకీయవర్గాలు విశ్లేషించారు. 


రాజకీయ అంశాలపైనా చర్చించినట్లుగా సమాచారం             


చంద్రబాబు పర్యటనలో రాజకీయ చర్చలు కూడా చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఆంద్రప్రదేశ్ లో ఇటీవలి కాలంలో  బయటపడుతున్న స్కాములు.. జగన్ పాలనలో చేసిన దోపిడీ  గురించి పూర్తి స్థాయిలో ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించినట్లుగా చెబుతున్నారు. లిక్కర్ స్కామ్‌లో సీఐడీ దర్యాప్తుతో పాటు వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగినందున ఈడీ విచారణకు సిఫారసు చేస్తామని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విషయాన్ని  మోదీ  దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. అలాగే బయటపడిన అనేక స్కాముల విషయంలో.. తీసుకోవాల్సిన చర్యల విషయంలోనూ.. కేంద్ర దర్యాప్తు సంస్థల జోక్యం అవసరమని అడిగినట్లుగా భావిస్తున్నారు. 


వైఎస్‌ఆర్‌సీపీకి ఆళ్ల నాని రాజీనామా- జిల్లా పార్టీ కార్యాలయం ఖాళీ


రాజ్యసభలో మెజార్టీ సాధించనున్న ఎన్డీఏ                                            


మరో వైపు జాతీయ రాజకీయాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయంలో  ఇటీవల కీలక మార్పులు వస్తున్నాయి. కొన్ని పార్టీల విలీనం.. మరికొన్ని పార్టీల పొత్తుల వ్యవహారాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అలాగే రాజ్యసభలో ఉపఎన్నికల తర్వాత ఎన్డీఏ మెజార్టీ సాధించనుంది. ఆ క్రమంలో ఎన్డీఏ అనుసరించాల్సిన వ్యూహంపైనా ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది.