How to avoid falling into a credit card trap  :  క్రెడిట్ కార్డు ఇప్పుడు ఓ నిత్యావసరం లాంటిది. ఏదైనా కొనాలనుకుంటే ముందుగా క్రెడిట్ కార్డు గుర్తుకు వస్తుంది ఎవరికైనా. కాస్త ఖర్చు ఎక్కవైనా ఏముంది.. ఈఎంఐలు పెట్టేసుకుందామని ముందుకెళ్లిపోతారు. ఆ వస్తువులు అవసరమా లేదా అన్నది చూసుకునేంత తీరిక ఉండటం లేదు. ఫలితంగా అప్పుల్లోకి కూరుకుపోతున్నారు. 


నిజానికి క్రెడిట్ కార్డు అనేది  గొప్ప వరం. కాన్నీ దాన్ని  సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే. మిమ్మల్ని కార్డు ఉపయోగించడం ప్రారంభిస్తే మాత్రం ఖర్చయిపోతారు. క్రెడిట్ కార్డును ఉపయోగించడం ఓ కళ. దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా క్రెడిట్ కార్డు ఫార్ములాను అర్థం  చేసుకోవాలి.                       


క్రెడిట్ కార్డు అంటే ఏమిటి.. మందస్తుగా మీకు ఓ బ్యాంక్ అప్పుగా ఇస్తున్న కార్డు. వాడుకున్నంత వాడుకోవచ్చని.. గడువులోపు కడితే రూపాయి కూడా చార్జీ అక్కర్లేదని.. అదే గడువు మీరిన తర్వాత  మాత్రమే వడ్డీ వేస్తాయని చెబుతాయి. ఈ వడ్డీలు ఊహించలేనంతగా ఉంటాయి. చార్జీలు కూడా అదనంగా ఉంటాయి. ఇది  స్థూలంగా క్రెడిట్ కార్డు.                               


అంటే గడువులోపల కడితే మనం కార్డుని ఉపయోగించుకున్నట్లు.. గడువు తర్వాత కడితే కార్డు మనల్ని ఉపయోగించుకున్నట్లు అనుకోవచ్చు. సాధారణంగా  కార్డుల బిల్లింగ్  సైకిల్ నలభై ఐదు రోజులకు ఉంటుంది. కానీ.. బిల్లింగ్ ముందు రోజు కొనుగోలు  చేస్తే.. తర్వాత బిల్లులో ఆ ఖర్చు వస్తుంది కాబట్టి పది రోజుల్లో కట్టాల్సి ఉంటుంది. బిల్లు  జనరేట్ అయిన రోజున కొనుగోలు చేస్తే.. మళ్లీ  బిల్లు జనరేట్ అయిన తర్వాత డ్యూడేట్ లో పు కట్టాల్సి ఉంటుంది. ఈ బిల్లింగ్ సైకిల్ ను అంచనా వేసుకుని మనం కట్టగలము అనుకున్న వాటిని కడితే.. ఆ కార్డును మనం వాడుకున్నట్లుగా  అవుతుంది. అంటే బ్యాలెన్స్ ఏమీ  ఉంచకుండా ఎప్పటికప్పుడు గడవులోపు కట్టేస్తే క్రెడిట్ కార్డును మనం ఉపయోగించుకున్నట్లే. 


అదే మినిమం  కట్టేసి.. మిగతా మొత్తం ఖర్చు పెట్టుకుంటూ పోతే.. కార్డు మనల్ని వాడేసుకుంటున్నట్లు అవుతుంది. మనల్ని కార్డు వాడుకోవడం అంటూ ప్రారంభిస్తే.. మన  శక్తిని పీల్చి పిప్పి చేస్తుంది. క్రెడిట్ కార్డులు ఎంత డేంజరో.. వచ్చే  బిల్లులు చెబుతూ ఉంటాయి. కానీ అప్పటికీ మునిగిపోయి ఉంటారు. వాటి నుంచి బయటపడటానికి మరో అప్పు చేయాల్సి ఉంటుంది. అలా అలా అప్పులు పెరుగుతాయి కానీ.. ఎప్పటికీ క్రెడిట్ కార్డు ట్రాప్ నుంచి బయటపడలేరు.                         


అందుకే క్రెడిట్ కార్డుతో అస్సలు గేమ్స్ వద్దు. చాన్స్ వచ్చినట్లుగా వాడుకోవచ్చు.. కానీ అది కట్టగలిగిన స్థాయిలోనే.. వాడుకోవాలి. ఏ మాత్రం.. క్రెడిట్ కార్డుకు దాసోహం అయినా ..  ఇల్లు గుల్ల అయిపోతుంది.