శ్రీవారి రూ.300 దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై కేసు నమోదు చేశారు. ఏడు సుపథం టికెట్లను దళారులు 35 వేల రూపాయలకు విక్రయించినట్లు తెలిసంది. ఈ వ్యవహారంలో టీటీడీ ఉద్యోగితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. దళారులు ఈ నెల 23న దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. టోకెన్ల తనిఖీ సమయంలో అనుమానం రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ జరపగా.. బయటకు వచ్చింది.
బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు
వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపింది. కరోనా నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించింది.
- 06-10-2021: అంకురార్పణ
- 07-10-2021: ధ్వజారోహణం, పెద్దశేష వాహనసేవ
- 08-10-2021: చిన్నశేష వాహనసేవ, హంస వాహనసేవ
- 09-10-2021: సింహ వాహన సేవ, ముత్యపుపందిరి వాహన సేవ
- 10-10-2021: కల్పవృక్ష వాహనసేవ, సర్వభూపాల వాహనసేవ
- 11-10-2021: మోహినీ అవతారం, గరుడ వాహనసేవ
- 12-10-2021: హనుమంత వాహనసేవ, గజ వాహనసేవ
- 13-10-2021: సూర్యప్రభ వాహనసేవ, చంద్రప్రభ వాహనసేవ
- 14-10-2021: రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనసేవ, అశ్వ వాహనసేవ
- 15-10-2021: పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం
నడక దారి పనులు పూర్తి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న నడక దారి పైకప్పు పనులు దాదాపు పూర్తయ్యాయని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో అలిపిరి కాలినడక మార్గం నుంచి భక్తులను అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దాతల సహకారంతో ఈ పనులు జరిపినట్లు వెల్లడించారు. లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుంచి నామాల గోపురం వరకు నిర్మించిన పైకప్పును, మార్గ మధ్యలో జరుగుతున్న అభివృద్ధి పనులనూ జవహర్ రెడ్డి పరిశీలించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: AP Letter TO GRMB: తెలంగాణ చెబుతున్నవన్నీ అబద్ధాలే.. డీపీఆర్‌లను ఆమోదించొద్దు.. జీఆర్ఎంబీకి ఏపీ లేఖ
Also Read: Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం