Bopparaju : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు వివిధ ఖాతాల కింద చెల్లించాల్సిన సొమ్ములు రూ. 20 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. పే స్కేల్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. పే స్కేల్ ను ఏ శాఖకు ఆ శాఖకు.. క్యాడర్ వారీగా ఇవ్వాలన్నారు. కరోనా కాలంలో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయారు... చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలనూ ఆదుకోవడం లేదు !
కరోనా కాలంలో చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకే ఉద్యోగాలు ఇస్తామనిఅన్నారు..అదీ కూడా అమలు కావడం లేదని బొప్పరాజు మండిపడ్డారు. గ్రామ, వార్దు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇచ్చారని.. కానీ ప్రోబేషన్ ప్రకటించక ముందు 200 మంది ఉద్యోగులు చనిపోయారు...వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల ను తక్షణమే క్రమబద్ధీకరణ చేయాలన్నారు. ఈ మేరకు సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ఉద్యోగి అని పేరు కనబడితే..రేషన్ కార్డు కట్ చేయడం దారుణమని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఉద్యోగల వేల కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు ?
ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ లు వేల కోట్లు బకాయి ఉంది..వెంటనే ఇవ్వాలన్నారు. జిపిఎఫ్ డబ్బులు ఏప్రిల్ 30 లోపు ఇస్తామని సీఎం చెప్పారు...కానీ జగన్ మాట తప్పారని విమర్శించారు.మా సహనాన్ని పరీక్షించి వద్దు..అవసరం అను కుంటే రోడ్డు మీదకు వస్తామని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు చేయాలి..జిపిఎస్ సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం తో ఘర్షణ వాతావరణం ద్వారా ఏమీ సాధించలేమని అయితే తమను ఇలానే ఇబ్బంది పెడితే రోడ్డెక్కుతామని హెచ్చరించారు. ఏపీలో టీచర్ల సమస్యలు తమ దృష్టికి రాలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. టీచర్స్ బయోమెట్రిక్, సమయ పాలన పాటించాల్సిందేననిఆయన వ్యాఖ్యానించారు. అయితే,ఫీల్డ్ స్టాప్ కు మినహాయించాల్సి ఉందన్నారు. టీచర్స్ బయోమెట్రిక్ హాజరుఇబ్బందులపై ఉన్నతాధికారులు..ముఖ్యమంత్రి కి చెప్పాలని సూచించారు.
టీచర్ల సమస్యలు తన దన దృష్టికి రాలేదన్న బొప్పరాజు
పీఆర్సీ అంశంపై గతంలో టీచర్ల ఉద్యోగ సంఘాలు కూడా పోరాడాయి. పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అయితే ఎలాంటి ప్రతిపాదనలు.. హామీలు లేకుండానే సమ్మె ను విరమించడంతో.. టీచర్స్ ఉద్యోగ సంఘాల నేతలు.. ఇతర ఉద్యోగ సంఘాలతో కటీఫ్ చెప్పారు. తాము సొంతంగా ఉద్యమం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు టీచర్లు .. వివిధ రకాల సమస్యలతో వచ్చే నెల ఒకటో తేదీన మిలియన్ మార్చ్ చేపట్టాలనుకుంటున్నారు. అయితే ఆ విషయం తమకు తెలియదన్నట్లుగా బొప్పరాజు స్పందించడం .. ఉద్యోగ సంఘాల్లో చర్చనీయాంశమవుతోంది.