AP Teachers :  ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా అయింది. స్కూల్ నిర్వహణకు సంబంధించి  పలురకాల యాప్‌లు ఇప్పటికే వినియోగిస్తూండగా తాజాగా ఉపాద్యాయుల‌కు ఫేస్ రిక‌గ్నేష‌న్ తో హ‌జ‌రు విదానం అమ‌లు చేయాలని నిర్ణయించారు. టీచర్ల ఫోన్లలోనే యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడమే కాకుండా..ఎప్పటికప్పుడు సెల్ఫీలు అప్ లోడ్ చేయాలి. తొమ్మిది గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్ వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇదంతా కుట్ర పూరితమని..  స‌ద‌రు యాప్ ల‌ను డౌన్ లోడ్ చేసేది లేద‌ని ఉపాద్యాయ సంఘాలు తెగేసి చెబుతున్నాయి.


సీపీఎస్ ఉద్యమం నిర్వీర్యం కోసమే వేధింపులంటున్న టీచర్లు !


ప్రభుత్వం ఉపాధ్యాయులకు  ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధాన  తీసుకోని రావడం  సరికాదని  ఉపాధ్యాయ సంఘాల నేతలు ఖండిస్తున్నారు.ఇప్ప‌టికే అనేక స‌మ‌స్య‌ల‌తో అల్లాడుతున్న ఉపాధ్యాయుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటామ‌ని హామి ఇవ్వ‌టంతో పాటుగా, మంత్రుల క‌మిటిని కూడా నియ‌మించిన‌ప్ప‌టికి ఆ దిశ‌గా ఎటువంటి చ‌ర్య‌లు ప్ర‌భుత్వం చేప‌ట్టలేదని అంటున్నారు.  ఇప్పుడు హ‌జ‌రు న‌మోదు వ్య‌వ‌హ‌రం పై మ‌రో వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆఫ్ డే లీవ్‌గా పరిగణిస్తామని పాఠశాల విద్యాశాఖ అదికారులు ఉపాద్యాయుల‌కు స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధన పట్ల ఉపాధ్యాయుల తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  యాప్ ద్వారా హాజరు విధానం సరికాదని.. ఇది టీచర్లపై కక్ష సాధింపు చర్యే అన్నారు. . తాను అధికారంలోకి రాగానే బయోమెట్రిక్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఫేస్ ఐడీ తీసుకువచ్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వారంలో రద్దు చేస్తానన్న సీపీఎస్ ఏమైందని.. డీఏబకాయిల ఊసే లేదని,వీటిని గురించి ప్ర‌శ్నిస్తుంటే,కొత్త స‌మ‌స్య‌ల‌ను క్రియేట్ చేయ‌టం వెనుక స‌ర్కార్ కుట్ర లేద‌న‌లేమ‌ని అంటున్నారు.


యాప్ వినియోగంలో సాంకేతిక సమస్యలు !
 
ఉపాధ్యాయులకు యాప్ హ‌జ‌రును అమ‌లు చేయ‌టం పై అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్న త‌రుణంలోనే స‌పాంకేతిక స‌మ‌స్య‌లు కూడా తెర మీద‌కు వ‌స్తున్నాయి.ప్ర‌దానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేసే ఉపాధ్యాయుల‌కు అక్క‌డ సెల్ ఫోన్ సిగ్న‌ల్ కూడా త‌క్కువ‌గా ఉంటుంది. మ‌రి కొన్ని చోట్ల అస‌లు మెబైల్ ఫోన్లే ప‌ని చేయ‌వు,ట్రైబ‌ల్ ఎరియాలో ఇలాంటి స‌మ‌స్య‌లు అధికంగా ఉంటాయి. అలాంటి స‌మ‌యంలో కూడ ఈ విధానం అమ‌లు ఎలా సాద్య‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.అంతే కాదు ప్ర‌భుత్వం సెల్ ఫోన్ ల‌ను, నెట్ స‌దుపాయాన్ని క‌ల్పించి   అప్పుడు యాప్ హ‌జ‌రు ను త‌ప్ప‌ని స‌రి చేయాల‌ని కూడ మ‌రి కొంద‌రు డిమాండ్ చేస్తున్నారు.


ఉద్యమాలు చేస్తున్నారన్న కోపంతోనే ప్రభుత్వం వేధిస్తోందా ? 


ఉద్యోగ సంఘాలు ఇటీవ‌ల ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హించా/f.  ఈ కార్య‌క్ర‌మం భారీగా స‌క్సెస్ అయ్యింది. పోలీసులు ఎన్ని అవాంత‌రాలు సృష్టించిన‌ప్ప‌టికి పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళ‌న‌లో పాల్గొన‌టంతో ప్ర‌భుత్వం పై వ‌త్తిడి పెరిగింది. దీంతో స‌మ్మెలోకి వెళుతున్న ఉద్యోగ సంఘాల నాయ‌కులతో స‌ర్కార్ చ‌ర్చ‌ల‌కు వెళ్ళ‌క త‌ప్ప‌లేదు. ఆ త‌రువాత మంత్రులు క‌మిటిని నియ‌మించింది. అయితే ఇక్క‌డే ఉద్యోగ సంఘాల్లో చీలిక‌లు వ‌చ్చాయి. అత్యంత కీల‌కం అయిన సీపీఎస్ అంశాన్ని గురించి ప్ర‌భుత్వం వ‌ద్ద హామి తీసుకోకుండా స‌మ్మె విర‌మించ‌టం పై ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాల జేఎసి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి తిరుగుబాటు చేశాయి. యూటీఎఫ్, ఫ్యాప్టో వంటి సంఘాలు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఇప్ప‌టికి ఉద్య‌మం చేస్తుండ‌టంతో వారి పై వ‌త్తిడిని పెంచేందుకు హ‌జ‌రు కోసం యాప్ ను అమ‌లు లోకి తీసుకువ‌చ్చార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.


సెప్టెంబర్ ఒకటిన మిలియన్ మార్చ్ !


సీపీఎస్ ఉద్యోగులు సెప్టెంబర్ ఒకటో తేదీన మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఈ తరుణంలో హడావుడిగా యాప్ ను తెచ్చి.. తక్షణం అమల్లోకి తేవడం .. ఉపాధ్యాయులను వేధించడానికేనని వారు అనుమానిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా మిలియన్ మార్చ్ ఆపబోమంటున్నారు.