BJP leader Vishnuvardhan expressed anger On CPM :  ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలోని పార్టీలు పార్టీ కార్యాలయాల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణం పార్టీ కార్యాలయాల్లో వినతులు తీసుకోవడం ఆపేసి.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికి మధ్య తేడా ఉండాలన్నారు. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తీరుపై బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు.  ఆనపర్తిలో బీజేపీ వారధి కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.   

  





 
రాను రాను కమ్యూనిష్టులు సిద్దాంతం వారి ఆలోచన తీసికట్టుగా మారుతున్నట్లు కనిపిస్తోందని  కూటమి పార్టీలు  ప్రజా సమస్యలు వినడం, పిర్యాదులు స్వీకరించడం , పరిస్కారం చేస్తున్న విధానంపై విమర్శలు  చూస్తే అర్థమైపోతుందన్నారు.   సాధారణ ప్రజలకు గ్రీవెన్స్ వ్యవస్థ కూటమి ప్రభుత్వంలో సమర్థంగా పని చేస్తోందని .. గుర్తుచేశారు.  ఈ మధ్య మీ కమ్యూనిష్టు పార్టీలు కూటమి ముఖ్యమంత్రి గారిని కలసి అభినందనలు కూడా తెలియచేశారని.. ఈ విషయాన్ని సీపీఎం నేతలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. 


పార్టీ కార్యకర్తలు తమ పార్టీ ఆఫీసులకు రాకూడదా అని విష్ణువర్ధన్ ప్రశ్న                


గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన మూడు పార్టీల కార్యకర్తలు తమ బాధల్ని చెప్పుకోవడానికి పార్టీ కార్యాలయాలకు వస్తున్నారని..  మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ ఆఫీసులకురావద్దని  మీరు బావిస్తున్నారా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కమ్యూనిస్టులు ప్రభుత్వాలు నడిపిన  త్రిపుర, బెంగాల్‌లలో  పార్టీ అంటే ప్రభుత్వం..  ప్రభుత్వం అంటే పార్టీ అన్నట్లుగా పాలన చేశారని ఇప్పుడెందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు.  నేటికి మీకు అధికారం ఉన్న కేరళలో మీరు ఈ రకంగా పిర్యాదులు  తీసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు.            


సీపీఎం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేశారు.. చేస్తున్నారు ?                      


ఇక్కడ మీ పార్టీ కార్యాలయాలకు ఎవరూ రారు, మీ ఆఫీసులు ఖాళీగా ఉంటాయని కూటమి పార్టీలవీ అలాగే ఉండాలటే ఎలా అని మండిపడ్డారు.  పార్టీకి , ప్రభుత్వానికి స్పష్టమైన తేడాను ప్రజలు అందరూ చూస్తున్నారు.. మీరు తప్ప. ప్రజల అభిప్రాయాలు అర్థం చేసుకునే మైండ్ సెట్ కమ్యూనిస్టు పార్టీలకు ఉండదన్నారు.  ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలని..  పేదలకు న్యాయం జరిగి అంశంలో వారికి వ్యతిరేకంగా ఇచ్చిన ప్రకటనపైన పేదప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.