YSRCP Balineni Srinivasa Reddy :  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ముఖ్య నేతలు ఆ పార్టీని వీడిపోతున్నారు. తాజాగా పార్టీపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంల విషయంలో తాను చేస్తున్న పోరాటన్ని పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రజల కోసం తాను పని చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి  పార్టీ నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. పార్టీ కార్యక్రమాలకూ పిలువడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.


వైసీపీ పట్టించుకోవడం లేదన్న  బాలినేని                           


పార్టీలో తన మాట కూడా వినేవారులేరని ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ బాలినేని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు అయినప్పటి నుంచి తాును పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పుకచ్చారు.  మాట్లాడితే జనసేనలోకి వెళ్తానని ప్రాచరం చేస్తున్నారని.. ఆ పార్టీలో కి వెళ్లకుండా కొంత మంది కుట్ర చేసి ఈ ప్రచారం చేస్తున్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తనపై రాజకీయంగా దాడి చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఇటీవల ఆయనపై భూకబ్జా ఆరోపమలు ఎక్కవగా వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆయన  తనపై రాజకీయంగా దాడి జరుగుతోందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం తనపై సీఐడీతో అయినా విచారణ చేయించుకోవచ్చని సవాల్ విసిరారు. 


గతంలోనే జనసేనతో చర్చలు జరిపినట్లుగా విమర్శలు                                                                    


బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కుటుంబానికి దగ్గర బంధువు. అయినప్పటికీ  ఆయనకు ఇటీవలి కాలంలో ప్రాధాన్యత దక్కడం లేదు. ఎన్నికలు ముందు్ కూడా తాను పోటీ చేయబోనని  ప్రకటించారు . కానీ ఎన్నికల సమయంలో జగన్ టిక్కెట్ ప్రకటించడంతో మళ్లీ పోటీ చేశారు. కానీ అత్యంత ఘోరమైన పరాజయం చూశారు. ఈవీఎంలపై అనుమానంతో వాటి పరిశీలనకు ఫీజు కట్టి  వాటి పనితీరును పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. అయితే మాక్ పోలింగ్ వద్దని.. పోలైన ఓట్లను పరిశీలిస్తానని ఆయన మళ్లీ  ఉన్నత న్యాయస్థానానికి వెళ్లారు. 


మరోసారి అలాంటి చర్చలు జరుగుతున్నాయా ?                                                            


తాజాగా బాలినేని చేసిన ప్రకటనను చూస్తే ఆయన వైసీపీకి  షాకవ్వడం కాయంగా  కనిపిస్తోంది. గతంలో కూడా చాలా సార్లు ఆయన జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ జాను జనలోకి వెళ్లకుంానే ఇలాంటి రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు. మొత్తంగా వైసీపీకి మరో బడా లీగర్ బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని అనుకోవచ్చు.