తిరుపతిలో అమరావతి రైతుల మహాద్యమ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలన్న నినాదంతో అమరావతికి భలు ఇచ్చిన రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేశారు. శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం బహిరంగసభ నిర్వహంచాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నారు.  ఎస్వీయూనివర్శిటీ స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి లభించలేదు. దీంతో  దామినేడు సమీపంలోని ఒక ప్రయివేటు స్థలంలో అమరావతి బహిరంగసభ నిర్వహణకు ఆగమేఘాలమీద ఏర్పాట్లు చేశారు.  


Also Read: సీఎం జగన్ తో ఫ్లిప్ కార్ట్ సీఈవో భేటీ... విశాఖలో పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం
 
 మహాపాదయాత్రకు సంఘీభావం ప్రకటించిన పార్టీల నేతలందరూ బహిరంగసభకు హాజరు కానున్నారు.  ఒక్క వైఎస్ఆర్‌సీపీ మాత్రమే అమరావతికి వ్యతిరేకంగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగసభకు హాజరవుతున్నారు. రేపు ఉదయం తిరుపతి చేరుకునే ఆయన మధ్యాహ్నం శ్రీవారి దర్శనం చేసుకుని ఆ తర్వాత బహిరంగసభకు హాజరవుతారు. ఇక జనసేన పార్టీ నుంచి పవన్ కల్యాణ్ హాజరవుతారనే అంచనాలు వచ్చాయి. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరిలో దీక్ష చేసినప్పుడు కలిసిన అమరావతి రైతులకు ముగింపు సభకు హాజరవుతానని హామీ ఇచ్చారు. అయితే ఆయన విదేశీ పర్యటనలో ఉండటం వల్ల జనసేన కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. 


Also Read: తిరుపతిలో జరగబోయేది తెలుగుదేశం పార్టీ సభ.... ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులది త్యాగం కాదా?... టీడీపీపై మంత్రి బొత్స ఫైర్


ఇక అమరావతికి భేషరతుగా బీజేపీ కూడా మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ ముఖ్య నేతలు  హాజరు కానున్నారు.  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతలు కూడా హాజరవుతారు.  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తాను వర్చువల్‌గా హాజరవుతానని ప్రకటించారు.  రాష్ట్రవ్యాప్తంగా అమరావతి రాజధానికి మద్దతు పలికే ప్రజా సంఘాలు, ప్రముఖులు సైతం హాజరు కానున్నారు. అన్ని పార్టీల మద్దతు ఉండటంతో భారీ ఎత్తున ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు.  మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల్లోపు సభ ముగించాల్సివుంటుందని కోర్టు ఆదేశించింది.  


Also Read: ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?


ఓ వైపు మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ మేధావుల ఫోరం పేరుతో  కొంత మంది ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అనూహ్యంగా మాకు మూడు రాజధానులే కావాలంటూ తిరుపతి ప్రజల పేరుతో ఫ్లెక్సీలు కట్టారు. ఈ కారణాలతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 


Also Read:  సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ తర్వాత పీఆర్సీపై ప్రకటన... ఉద్యోగులు ఆందోళనను వాయిదా వేసుకోవాలి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి