Tollywood Movies : సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చింది. వీరసింహరెడ్డికి అన్ని క్లాస్ లపై 20 రూపాయలు, వాల్తేరు వీరయ్యకు 25 రూపాయల పెంపునకు అవకాశం కలిపించింది. సినిమాలు విడుదలైన మొదటి 10 రోజులు ధరల పెంపునకు ఏపీ సర్కార్ ఛాన్స్ ఇచ్చింది.  


ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఓకే 


 చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల టికెట్‌ ధరలు ఫిక్స్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది. పండగ సందర్భంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ వినతిపై టికెట్‌ ధరపై గరిష్ఠంగా రూ. 25 పెంచుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరసింహారెడ్డి సినిమా టికెట్‌ ధరను రూ. 20 పెంచుకునేందుకు, వాల్తేరు వీరయ్య టికెట్‌ ధర రూ. 25 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సినిమా విడుదలైననాటి నుంచి మొదటి 10 రోజుల వరకు ధరల పెంపు వర్తిస్తుంది. 


ఆరో ఆటకు తెలంగాణ సర్కార్ అనుమతి 


వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల స్పెషల్‌ షోలకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చింది.  ఈ రెండు చిత్రాలకు ఆరో ఆటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు చిత్రాల రిలీజ్ రోజున ఉదయం 4 గంటల ఆటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' జనవరి 12న, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ ఈ నెల 13న విడుదల కానున్నాయి. ఈ చిత్రాలు విడుదల రోజున ఉదయం 4 గంటల షోకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. 






గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సంగీత దర్శకుడు తమన్ (Thaman) ది హిట్ కాంబినేషన్. 'అఖండ' వంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత వాళ్ళిద్దరూ చేసిన సినిమా 'వీర సింహా రెడ్డి'.  కరోనా తర్వాత మళ్ళీ థియేటర్లకు తండోప తండాలుగా ప్రేక్షకులను తీసుకు వచ్చిన క్రెడిట్ 'అఖండ'కు దక్కుతుంది. ఆ సినిమా తరహాలో 'వీర సింహా రెడ్డి' కూడా హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని తమన్ అంటున్నారు. 






మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా, మాస్ మహారాజా రవితేజ  (Ravi Teja) ప్రత్యేక ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya Movie). పూనకాలు లోడింగ్... అనేది ఉపశీర్షిక. ఇందులో చిరు జోడీగా శ్రుతీ హాసన్, రవితేజకు జంటగా కేథరిన్ ట్రెసా నటించారు. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.