Breaking News Live Telugu Updates: కుప్పకూలిన మహారాష్ట్ర ప్రభుత్వం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 29 Jun 2022 09:49 PM
కుప్పకూలిన మహారాష్ట్ర ప్రభుత్వం

ఫ్లోర్ టెస్ట్‌కు ముందే సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయడంతో ఎంవీఏ కుప్పకూలింది, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

సుప్రీంలో

మహారాష్ట్ర సంక్షోభం గురువారం బలపరీక్షతో క్లైమాక్స్ చేరేటట్లు కనిపిస్తోంది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అసెంబ్లీలో గురువారం బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ భగవత్‌ సింగ్‌ కోష్యారి కోరారు. దీంతో ప్రస్తుతం జైలులో ఉన్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP)కి చెందిన ఎమ్మెల్యేలు నవాబ్‌ మాలిక్‌, అనిల్‌ దేశ్‌ముఖ్‌ బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Bhadradri Kothagudem District: జీతాలు ఇవ్వాలని విధులు బహిష్కరించిన వైద్యులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 18 మంది డాక్టర్లు బుధవారం నుండి ఓపీ సేవలను బహిష్కరించారు. నవంబర్ నెల నుండి విధులకు హాజరవుతున్న డాక్టర్లకు నాలుగు నెలల నుండి వేతనాలు, స్టైఫండ్ చెల్లించకపోవడంతో ఓపీ ప్రధాన ద్వారం వద్ద విధులను బహిష్కరించారు. నినాదాలు చేసి ఆందోళన చేపట్టారు. వైద్యులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని వారు హెచ్చరించారు. ఈ విషయంపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కుమారస్వామి వివరణ కోరగా సమస్యనుపై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. డాక్టర్ల జీతాలు మంజూరయ్యాయని రెండు రోజుల్లో డాక్టర్ ల అకౌంట్లో పడతాయని తెలిపారు. ఈ విషయాన్ని వైద్యులు మాత్రం ఖండిస్తున్నారు.. ఏది ఏమైనా  న్యాయం జరగకపోతే విధులకు హాజరు కామని అంటూ హెచ్చరిస్తున్నారు.

Palnadu Accident: చిలకలూరిపేట మండలంలో రోడ్డు ప్రమాదం

  • కారు,ఆటో ఢీ నలుగురికి తీవ్రగాయాలు

  • చిలకలూరిపేట మండలం మంగళపాలెం బ్రిడ్జ్ సమీపంలో జాతీయరహదారి పై కారు, ఆటో ఢీ

  • ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు

  • వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు

Hyderabad: హైదరాబాద్‌లో మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

  • ప్రధాని సభ నేపథ్యంలో వెలసిన ఫ్లెక్సీలు

  • హైదరాబాద్ బీజేపీ జాతీయ కార్యవర్గం ముందు వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు

  • నగరంలోని కంటోన్మెంట్ ఏరియాలోని పరేడ్ గ్రౌండ్ చుట్టూ బై బై మోదీ అంటూ పోస్టర్లు

  • కేసీఆర్‌కు మద్దతు తెలుపుతూ కూడా పోస్టర్లు

  • పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని బహిరంగ సభ, జూలై 3న భారీ ర్యాలీ

  • ఆ పోస్టర్లపై ఫిర్యాదు మేరకు తొలగించిన అధికారులు

Gold Smuggling in Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‎పోర్టులో మరోసారి భారీగా బంగారం దొరికిపోయింది. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సుమారుగా 220 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మేకప్ కిట్, కుర్తా బటన్స్‎లలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఇతను పట్టుబడ్డాడు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారణ చేస్తున్నారు.



 

Narayana Swamy: మళ్లీ నోరు జారిన ఏపీ డిప్యూటీ సీఎం, సీఎంను అంతమాట అనేశారే!

ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి మ‌రోమారు నోరు జారారు.. త‌మ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆయ‌న భూక‌బ్జాదారుల‌కు నాయ‌కుడిగా అభివ‌ర్ణించారు. అంతే కాకుండా జ‌గ‌న్ మాట్లాడేది అన్యాయ‌మ‌ని, ప్రజ‌లు ఇప్పటికైనా ఆలోచించి మేల్కోనాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.. ఈ మేర‌కు తిరుప‌తి వేదిక‌గా జ‌రిగిన పార్టీ ప్లీన‌రీలో నారాయ‌ణ స్వామి మాట్లాడారు. నారాయ‌ణ స్వామి నోరు జారిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Background

నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విస్తరించడంతో పలు జిల్లాల్లో మంగళవారం తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అల్పపీడన ద్రోణి ఉత్తర భారత ద్వీపకల్ప 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి గాలులకోత సగటు సుమద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఏపీలోని కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన ఉంది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పాటు యానాంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. జిల్లాల్లోని కొన్ని చోట్ల మాత్రం కేవలం తేలికపాటి జల్లులు పడతాయి. విశాఖ నగరలోని పలు భాగాలు ముఖ్యంగా సింహాచలం వైపు, గోపాలపట్నం, గాజువాక వైపుగా మంగళవారం మోస్తరు వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి, కొనసీమ జిల్లాలు, అనకాపల్లి జిల్లాలోకి వర్షాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి వచ్చే మేఘాల వల్ల కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు పెరగనున్నాయని, మరోవైపు విజయవాడలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలే అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.


హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.


తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. కానీ భారీ వర్ష సూచన లేదు. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.