Breaking News Live Telugu Updates: క్యాసినో కేసులో రాజకీయ నేతలకు ఈడీ నోటీసులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
క్యాసినో కేసులో రాజకీయ నేతలకు ఈడీ నోటీసులు.
ఈడీ ముందుకు తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు
రేపు,ఎల్లుండి హాజరుకావాలంటూ ఆదేశం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఏప్రిల్‌లో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువు అధికారులు పొడిగించారు. ఎటువంటి జరిమానా లేకుండా ఫీజు చెల్లించే గడువును నవంబరు 24వ తేదీ వరకు పెంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం గడువు మంగళవారంతో ముగియనుండగా తాజాగా దానిని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
కొత్త తేదీలివే..
ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: నవంబర్ 24,2022.రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: డిసెంబర్ 5, 2022.రూ.200 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2022.రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: డిసెంబర్ 29,2022
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.12.30 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన 7 నూతన పోలీస్‌స్టేషన్ లను మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
కడప జిల్లా పులివెందులలో వీఆర్వోపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. నగరిగుట్టకు చెందిన రాగిపాటి పెద్ద మస్తాన్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వీఆర్వో కృష్ణమోహన్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణానికి మస్తాన్ ఎందుకు ఒడిగట్టాడన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
- హైదరాబాద్ పాతబస్తీ ఐఎస్ సదన్ చౌరస్తా లో బాంబ్ స్కాడ్ తనిఖీలు
- గుర్తు తెలియని ఆగంతకులు 100కి డయల్ చేసి బాంబ్ ఉందని బెదిరింపులు
- అప్రతమైన పోలీసులు బాంబ్ స్కాడ్ అధికారులతో తనిఖీలు
- సంఘటన స్థలానికి చేరుకుని అణువణువు తనిఖీలు
- 100 డయల్ చేసిన వ్యక్తి హఫీజ్ బాబా నగర్ కు చెందినా అక్బర్ ఖాన్ గా గుర్తింపు
- సైదాబాద్ పోలీసుల అదుపులో నిందితుడు, మద్యం మత్తులో నిందితుడు
పరిపాలన రాజధానిగా విశాఖలో త్వరలలో పరిపాలన కొనసాగుతుందని ఏపి డెప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు.. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించేందకు బలం చేకూర్చాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. సామాన్య ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు మాత్రం ద్వేషం చిమ్ముతున్నారని విమర్శించారు.. త్వరలో విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని, చంద్రబాబు డైరెక్షన్ చేసే పాదయాత్ర చేసారని, అమరావతి రాజధానిగా కావాలంటూ దొంగ పాదయాత్ర చేసారని, అందుకే పాదయాత్ర ఆగిపోయిందన్నారు.. మూడు రాజధానులి అమలు చేయడం తధ్యంమని, అందులో ఎటువంటి మార్పు లేదని డెప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.
- కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటా మ్యాజిక్
- ఒకరు అక్కడికక్కడే మృతి, ముగ్గురు ఆసుపత్రిలో మృతి, మరో 9 మందికి గాయాలు
- తాడేపల్లిగూడెం నుండి వైజాగ్ వెళుతుండగా జరిగిన ప్రమాదం
- మృతులు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణ పురానికి చెందిన వారిగా గుర్తింపు
మృతుల వివరాలు
- డ్రైవర్ నల్లజర్ల గ్రామం
- ప్రసాద్ నారాయణపురం
- మహేష్ ఉండ్రాజవరం
- మంగ నల్లజర్ల
విషమ పరిస్థితుల్లో.. హారతి వరంగల్, మణికంఠ గుణంపల్లి
తిరుమల శ్రీవారిని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వామి వారి సేవలో పాల్గొనగా, కేంద్ర మంత్రి వెంట ఏపి మంత్రి అంబటి రాంబాబు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడెప్పలు స్వామి వారి ఆశీస్సులు పొందారు.. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని, దేశం మరింత పురోభివృద్ధి సాధించాలని, అలాగే విశ్వశాంతి కోసం స్వా మి వారిని ప్రార్థించినట్లు తెలిపారు.
Background
ఈశాన్య రుతపవనాలకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండింటి కారణంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడుకు ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల వానలు దంచి కొడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా భిన్నంగా కనిపిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్,్ యానంపై పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ప్రభావం కనిపిస్తుందని పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో దీని ఎఫెక్ట్ కనిపిస్తుందని వెల్లడించింది.
తెలంగాణలో పరిస్థితి ఇలా..
హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుంది. ఎక్కడా వర్ష సూచన లేదు. వచ్చే 3 రోజులు ఇలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలో వర్షాల సంగతి పక్కనపెడితే చలి మాత్రం వణికించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు ఇబ్బంది పెట్టనున్నాయి. మూడు రోజుల పాటు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
మంగళవారం హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీలు ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదం ఉంది. 11 డిగ్రీల నుంచి 9 డిగ్రీల మధ్య నమోదు అయ్యే ఛాన్స్ ఉన్నట్టు చెబతున్నారు. అందుకే ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
బంగారం, వెండి ధరలు
నిన్నటితో (మంగళవారం) పోలిస్తే బంగారం ధర (Today's Gold Rate) ఇవాళ (బుధవారం) తగ్గింది. 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 460, స్వచ్ఛమైన పసిడి ₹ 490 చొప్పున దిగి వచ్చాయి.
కిలో వెండి ధర ఏకంగా ₹ 1,000 పెరిగింది.
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 47,800 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 52,150 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 68,500 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 47,800 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 52,150 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 68,500 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -