Nimmala Ramanaidu Comments: చంద్రబాబు తన ఐదు సంతకాలతో ఏపీ ప్రజల భద్రతకు భరోసా ఇచ్చారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మెగా డీఎస్సీపై సంతకం చేసి యువతకు ఇచ్చిన మాట నెరవేర్చారని అన్నారు. 16,343  పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించారని అన్నారు. గురువారం (జూన్ 13) ఆయన మీడియాతో మాట్లాడారు.


‘‘రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై పెట్టడం ద్వారా ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించారు. మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ప్రజల ఆస్తులకు వారసుడుగా మారే ప్రయత్నం చేశాడు జగన్. మూడో సంతకంగా సామాజిక పింఛన్లపై సంతకం పెట్టారు. పెన్షన్లపై కూడా జగన్ అబద్ధాలు చెప్పారు. ఒక్క సంతకంతో ఏకంగా వృద్ధుల పెన్షన్ లను రూ.4 వేలకు, దివ్యాంగుల పెన్షన్ లను రూ.6 వేలకు పెంచారు చంద్రబాబు. ఈ పెన్షన్ లను ఇంటి వద్దే అందించేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతానికి పింఛన్లు గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ద్వారానే ఇళ్ల దగ్గరే అందజేస్తాం’’


నాలుగో సంతకంగా అన్నా క్యాంటీన్ పునరుద్ధరణపై పెట్టారు. ఒక నిరుపేద కేవలం రూ.15 రూపాయలతో మూడు పూటలా తినేలా ఈ పథకాన్ని చంద్రబాబు తీసుకొచ్చారు. దాన్ని కూడా జగన్ రద్దు చేశాడు. కావాలంటే పేరు మార్చుకోండి అని అసెంబ్లీలో మేం ప్రాధేయపడినా ఆ సైకో వినలేదు. 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేస్తాం. ఐదో సంతకంగా స్కిల్ డెవలప్ మెంట్ సెన్సెస్ పై చంద్రబాబు చేశారు. స్టూడెంట్స్ లోని ప్రతిభను సానబెట్టేలా ఇకపై స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలు పనిచేస్తాయి. అధికారంలోకి రాగానే ఇన్ని పథకాలపై సంతకం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబే. 


మా ప్రెస్ మీట్లలో బూతులు ఉండవు
మా మంత్రుల మీటింగ్స్ లో బూతులు, తిట్లు ఉండవు. జగన్ పాలన మొత్తం తిట్లు.. బూతులు.. విద్వేషం.. విధ్వంసం.. కేసులతో నడిచింది. ఎన్డీఏ పాలనలో అభివృద్ధి, సంక్షేమ, సంస్కరణలతో కూడి ఉంటుంది. మా నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కూడా మాకు అదే చెప్పారు. మేం బూతులు తిట్టం’’ అని అన్నారు.


బ్రిటీష్ పాలన కంటే ఘోరం
మరో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. జగన్ పాలన మొత్తం గంజాయి, డ్రగ్స్, లాంటి వాటితో సాగింది. నిర్వీర్యం అవుతున్న యువత కోసం చంద్రబాబు ఈ ఐదు సంతకాలు చేశారు. సామాజిక భద్రత తెలుగు దేశం ధ్యేయం. రైతుల, ప్రజల ఆస్తుల రక్షణ కోసమే లాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పై సంతకం పెట్టారు’’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయని.. మెగా డీఎస్సీ పేరుతో జగన్ యువతను ఐదేళ్లు మోసం చేశారని మరో మంత్రి సవిత అన్నారు. బ్రిటీష్ పాలన కంటే ఘోరంగా జగన్ పాలన చేశారని అన్నారు.