AP HighCourt :  ఇద్దరు అధికారులకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. సర్వీస్ అంశాలలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో శిక్ష విధించింది. గతంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన బుడితి రాజశేఖర్, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ రామకృష్ణకు జైలు శిక్ష విధించారు. ఇద్దరు అధికారులకూ నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధించింది. రాజశేఖర్‌, రామకృష్ణను తుళ్లూరు పోలీసులకు అప్పగించాలని ఎస్పీఎఫ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ గతంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. 


రామకృష్ణ గతంలో ఇంటర్ బోర్డు కమిషనర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కోర్టు తీర్పును అమలు చేయలేదని వారు అభియోగాలు ఎదుర్కొన్నారు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది.ప్రస్తుతం బుడితి రాజశేఖర్ సెలవులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన అమెరికాలో ఉన్నారు. మరో ఐఏఎస్ అధికారి రామకృష్ణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా ఉన్నారు. వీరిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఇప్పటికి పలుమార్లు హైకోర్టులో విచారణ జరిగినా... ఆదేశాలు అమలు చేయకపోవడంతో  హైకోర్టు ధిక్కరణ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 


మరో వైపీ ఏపీ అధికారులు వరుసగా కోర్టు ధిక్కరణ కింద శిక్షకు గురవుతున్నారు. ఇటీవలే  ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలని గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై దాఖలైన కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. వీటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఏడాది గడిచినా ఇంకా సచివాలయాల్ని స్కూళ్లలో నుంచి తొలగించలేదు. దీన్ని హైకోర్టు ధిక్కారంగా భావించింది. ఉద్దేశపూర్వకంగానే సదరు అధికారులు కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వీరిపై ఇవాళ జరిగిన విచారణలో కీలక నిర్ణయం తీసుకుంది.కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు 8 మంది ఐఏఎస్ అధికారులపై కన్నెర్ర చేసింది. వీరికి రెండు వారాల జైలుశిక్ష విధించడంతో పాటు జరిమానా కూడా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 


వీరిలో విజయ్ కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేదీ, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చినవీరభద్రుడు, ఎంఎం నాయక్ ఉన్నారు. హైకోర్టు ఆగ్రహంతో ఐఏఎస్ అధికారులు క్షమాపణలు చెప్పారు. దీంతో జైలుశిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని తీర్పులో మార్పు చేసింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టళ్లకు వెళ్లి సేవ చేయాలని వీరికి ఆదేశాలు ఇచ్చింది. విద్యార్ధుల మధ్యాహ్నం, రాత్రి భోజన ఖర్చులతో పాటు ఒక రోజు హైకోర్టు ఖర్చులు కూడా భరించాలని ఆదేశించింది. ఇలాంటి తీర్పులు పలువురు అధికారుల విషయంలో వచ్చాయి. తర్వాత డివిజనల్ బెంచ్‌కు వెళ్లి శిక్షను నిలిపివేస్తూ ఆదేశాలు తెచ్చుకున్నారు. 


ఖమ్మం సభకు జనాన్ని తరలిస్తే 10లక్షలు ఇప్పిస్తా, లేకుంటే ఉన్నవి పీకేస్తాం-మంత్రి ఎర్రబెల్లి కాంట్రవర్సియల్ స్టేట్‌మెంట్‌!