ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2019 జూలై 1 నుంచి డీఏ వర్తించజేయనుంది. దీంతో ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నుంచి జీతంతో పాటు డీఏ తీసుకోనున్నారు. డీఏ బకాయిలను 2002 జనవరి నుంచి మూడు విడతలుగా ఉద్యోగులకు చెల్లిస్తారు. డీఏ ఉత్తర్వులు విడుదల చేసినందుకు సీఎం జగన్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కె. వెంకట రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: పల్నాడులో రూ. 1500 కోట్లతో సిమెంట్ పరిశ్రమ.. సీఎంను కలిసిన శ్రీసిమెంట్స్ ఓనర్లు !
Also Read: టీడీపీలో చేరేందుకు సూరి తాపత్రయం.. అడ్డం పడుతున్న శ్రీరామ్ ! ఎవరిది పైచేయి ?
ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డీఏ విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2019 జులై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏని విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా 2022 జనవరి నుంచి జీతంతో పాటు కొత్త డీఏ జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన డీఏని చెల్లించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు, మిగతా 90 శాతాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనున్నట్లు ప్రకటించింది. జడ్పీ, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, అన్ని ఎయిడెడ్ సంస్థలు, విశ్వవిద్యాలయాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: టీడీపీలో చేరేందుకు సూరి తాపత్రయం.. అడ్డం పడుతున్న శ్రీరామ్ ! ఎవరిది పైచేయి ?
Also Read: Palasa Cashew Cultivation: తీవ్ర నష్టాల్లో సిక్కోలు జీడి పరిశ్రమ... మూతపడుతున్న పలాస పరిశ్రమలు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి