ఏ పండుగలో పరమార్థం అయినా అంతా సంతోషంగా ఉండటమే. అన్ని పండుగల్లో కొత్తబట్టలు, స్వీట్స్ , సెలబ్రేషన్స్ కామన్. కానీ క్రిస్మస్ కి మాత్రమే ఉన్న ప్రత్యేకత బహుమతులు ఇచ్చుకోవడం. అందుకే క్రిస్మస్ ఇతరులను ఆనందపరిచే పండుగ అని కూడా అంటారు. 


Also Read: కిస్మస్ రోజు 'ట్రీ' ని ఎందుకు అలంకరిస్తారు.. చెట్టుకి -వేడుకకు సంబంధం ఏంటి..
కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏం ఇష్టమో వాటిని ఈ పండుగ రోజు సీక్రెట్ గా బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తారు. క్రిస్మస్ తాత ‘శాంటాక్లాజ్’వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్లాడని పిల్లల్ని నమ్మించేవారు. ఈ పండుగకు బహుమతులను ఇవ్వడం అనేది విదేశాల్లో ఓ ఆచారం. క్రిస్మస్ కి ముందే పిల్లలు తమకు కావాల్సిన బహుమతుల జాబితా తయారు చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తారు. అందులో పేర్కొన్న కానుకల్లో ఏదో ఒకటి పిల్లలకు ఇస్తుంటారు. పిల్లలు మాత్రం శాంటా వచ్చి ఇచ్చాడని సంబరపడతారు. ఇంతకీ శాంటా బహుమతులు ఎందుకిస్తారు. ఇది ఎప్పటి నుంచి మొదలైంది. 


Also Read: క్రిస్మస్ ని డిఫరెంట్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..
క్రిస్మస్ తాత ఎలా పుట్టాడంటే..
ఓ ధనికుడైన వృద్ధుడు ఒంటరిగా జీవించేవాడు. కాలక్షేపం కోసం రోజూ సాయంత్రం అలా బయటకు వెళ్లేవాడు. ఓ వీధిలో తిండి, బట్ట లేక చలికి వణుకుతున్న ఓ కుటంబాన్ని చూసి చలించిపోయాడు. పిల్లలకు బట్టలు కూడా లేకపోవడం చూసి బాధపడ్డాడు. వారికి సాయం చేయాలని అనుకుని ఓ రాత్రి వేళ సీక్రెట్ గా వెళ్లి  దుప్పట్లు, దుస్తులు, ఆట బొమ్మలు, కొంత డబ్బు ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయాడు.  అప్పుడు ఆయన తలకు చలి టోపి, కోటు  ధరించి చేతిలో కర్రతో ఉన్నట్టు గమనించారు. ఆ రోజు క్రిస్మస్ కావడంతో దేవుడే శాంటాక్లాజ్( క్రిస్మస్ తాత) ను పంపించాడని విశ్వసించడం మొదలెట్టారు. అప్పటి నుంచీ క్రిస్మస్ సమయంలో పేదలకు సహాయం చేయడం, పిల్లలకు బహుమతులు ఇవ్వడం మొదలైందని చెబుతారు.


ప్రచారంలో ఉన్న మరోకథ: 13 వ శతాబ్దంలో డెన్మార్క్‌లో సెయింట్ నికొలస్ అనే క్యాథలిక్ బిషప్ ఉండేవాడు. అదే ఊరిలోని ఒక నిరుపేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయలేక ఇబ్బంది పడుతూ ఉండేవాడు.  ఆయన సమస్య గుర్తించిన బిషప్ ఒక రాత్రి వేళ ఆ నిరుపేద ఇంటిమీదున్న పొగగొట్టంలోంచి 3 బంగారు నాణాలున్న సంచులు జారవిడుస్తాడు. అయితే అవి నేరుగా జారి  పొయ్యిపక్కనే ఆరేసిన మేజోళ్ళలో (సాక్సులు) పడతాయి. అవి చూసుకున్న ఆ పేదవాడు ఎంతో సంతోషపడతాడు. ఆ విషయం తన ఇరుగు పొరుగువారికి ఎంతో ఆనందంగా చెప్పుకుంటాడు. దీంతో బీదవారంతా తమకు ఎంతో కొంత సాయం అందుతుందని ఎదురుచూడడం మొదలుపెట్టారు. బిషప్ ప్రేరణతో మనసున్న ఎందరో ధనికులు క్రిస్మస్ తాతయ్యల రూపంలో తమ ప్రాంతంలోని పేదలకు రహస్యంగా సాయం చేయటం మొదలుపెట్టారు.   


Also Read:  చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి.
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చేరిన కోల్ కతా దుర్గామాత వేడుకలు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి