AP Moive Online Tickets : ఆన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాలపై ఎపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది.నోడల్ ఏజెన్సీగా APFDC సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.ఇక రాష్ట్రంలోని అన్ని థియేటర్లు ఏపీఎఫ్‌డీసీ ( APFDC ) తో ఒప్పందం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.అంతే కాదు నోడల్ ఏజెన్సీ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే టికెట్లు విక్రయించాలని,ప్రతి టికెట్‌పై 2 శాతం సర్వీస్ ఛార్జి వసూలు కు ఆదేశాలు ఇచ్చారు.థియేటర్లు పక్కాగా ఆన్ లైన్‌లో టికెట్లు అమ్మకాలు చేయాలని,కొత్త సినిమాకు వారం ముందు నుంచి మాత్రమే టికెట్లు అమ్మాలని కూడ గైడ్ లైన్స్ లో పేర్కొంది.
ప్రతి టిక్కెట్‌పై 2 శాతం సర్వీస్ చార్జి !
ప్రతి టిక్కెట్ పై 2 శాతం సర్వీస్ ఛార్జిని వసూలు చేస్తారు. ఆల్ లైన్ టిక్కెట్ల అమ్మకాలకు సంబంధించి మౌలిక సదుపాయాలను థియేటర్ల యాజమాన్యమే ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. థియేటర్లలో పక్కాగా ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాలు చేయాలని, కొత్త సినిమాకు వారం ముందు నుంచే టిక్కెట్లు విక్రయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు అమలు చేయకపోతే ధియేటర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
గతంలో ఆన్ లైన్ టిక్కెటింగ్ సంస్థ కోసం టెండర్
ఆన్ లైన్ టిక్కెట్లపై ప్రభుత్వం గతంలో చట్టం చేసింది. ఎపీఎఫ్‌డీసీ ద్వారా ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేసి టిక్కెట్లు అమ్మాలనుకున్నారు. తర్వాత టిక్కెట్ల అమ్మకాలకు ఆన్ లైన్ టిక్కెటింగ్ సంస్థల నుంచి టెండర్లు పిలిచారు ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలకు రెండు సంస్థలు పోటీ పడగా.. జస్ట్ టికెట్స్ సంస్థ ఎల్-1గా నిలిచింది. ఏప్రిల్ 1 నుంచి ఆన్ లైన్ లో టికెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం ఫైనలైజ్ చేయలేదు. కొంత ఆలస్యం తర్వాత ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే గతంలో ప్రభుత్వం ఖరారు చేసే ఒక్క సంస్థ ద్వారా మాత్రమే టిక్కెట్లు అమ్మాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇతర ఫ్లాట్ ఫామ్‌ల ద్వారా కూడా టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ధియేటర్ యజమానుల అసంతృప్తి
కొత్త నిబంధనలపై సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందనా ఇంకా వ్యక్తం కాలేదు. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఆంక్షలల మద్య సగటు ప్రేక్షకుడు ధియేటర్ కు వచ్చి సినిమా చూసే పరిస్దితి ఉండదని అంటున్నారు. టిక్కెట్ల ధరలు ఓటీటీల ప్రభావం కారణంగా ధియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోతున్నారని.. ఇలాంటి నిబంధనల వల్ల మరింతగా తగ్గిపోతారని వారు ఆవేదన చెందుతున్నారు.