Telangana Alluri BJP : తెలంగాణ బీజేపీ నేతలు అల్లూరి సీతారామరాజును తెలంగాణ సాయుధ పోరాట యోధునిగా చెబుతూండటం వివాదాస్పదమవుతోంది. స్వయంగా హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా .. అమరవీరుల జాబితాలో ఫోటోలను కూడా ప్రదర్శించడం ఇప్పుడు రకరకాలుగా చర్చలకు కారణం అవుతోంది. ఇదంతా వాట్సాప్ యూనివర్శిటీ సైడ్ ఎఫెక్టులని కేటీఆర్ వంటి నేతలు బీజేపీపై సెటైర్లు వేస్తున్నారు. 







తెలంగాణ సాయుధ పోరాటంలో మన్యం వీరుడు !


అల్లూరి సీతారామరాజు తెలంగాణ విముక్తి కోసం రాంజీగోండు, కొమురంభీంతో కలిసి నిజాంపై పోరాటం చేశారని ప్రకటించారు.   నిజానికి ఎక్కడా అల్లూరి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని ఇంత వరకూ ఎవరూ చెప్పలేదు. ఎలాంటి చరిత్ర లేదు.  రు. ఇది తెలంగాణ చరిత్రను, అల్లూరి వీరత్వాన్ని రెండింటినీ కించపర్చడమేనని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. వాట్సాప్ యూనివర్శిటీ సైడ్ ఎఫెక్టులని కేటీఆర్ విమర్శించారు.  


 





 


మన్యంలోనే అల్లూరి పోరాటం ! 


బ్రిటీష్‌ పాలకుల దాస్య శృంఖలాల నుంచి ఆదివాసీలను విముక్తులను చేయడమే లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు నడిపించిన సాయుధ పోరాటానికి స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యేక స్థానముంది. మన్యంలోనే అల్లూరిపోరాటం సాగినట్లుగా అందరికీ తెలుసు. గిరిజనులపై బ్రిటీష్‌ పాలకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతుండడంతో ఇక శాంతియుత పోరాటంతో లక్ష్యం చేరలేమని భావించిన అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటానికి సన్నద్ధమయ్యారు. ఆయుధ సేకరణే లక్ష్యంగా 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై తొలి మెరుపుదాడి చేశారు.  ఆ దాడులు విజయవంతం కావడంతో  పోలీస్‌ స్టేషన్‌లపై దాడుల పరంపరను కొనసాగించారు.  సీతారామరాజు  మే7 1924న బ్రిటీష్‌ సేనలకు పట్టుబడ్డారు.  అంటే ఇరవై ఆరేళ్లకే చనిపోయారు.  


తెలంగాణ చరిత్రనూ వక్రీకరిస్తున్నరనే విమర్శలు !


ఇటీవలి కాలంలో బీజేపీ చరిత్రను తిరగరాస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తెలంగాణ చరిత్రలోకి కొత్తగా అల్లూరిని తీసుకు వస్తున్న వైనంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రను కూడా మారుస్తున్నారా అని టీఆర్ఎస్ సపోర్టర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.  మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.