AP BJP What Next :  ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు ఇప్పుడుపెద్ద చిక్కు వచ్చి పడింది. అసలు సీఎం అభ్యర్థి ఎవరు అనేది వారికి వచ్చిన సమస్య. తమలో తామే అయితే.. పార్టీ హైకమాండ్ ప్రకటిస్తుందని చెప్పేవారు. కానీ ఇప్పుడు జనసేనతో పొత్తులో ఉన్నందు వల్ల పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అని ప్రకటించాల్సిన పరిస్థితి వస్తోంది. తిరుపతి ఉపఎన్నికల సమయంలో సోము వీర్రాజు వంటి నేతలు పవన్ కల్యాణ్ తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. కానీ అనేక రకాల ఒత్తిళ్లు రావడంతో వెనక్కి తగ్గారు. సీఎం అభ్యర్థిని పార్టీ హైకమాండ్ ఖరారు చేస్తుందని ప్రకటించారు. 


బీజేపీ-జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ కాదా?


ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీలో సీఎం అభ్యర్థిపై చర్చ మరోసారి జరుగుతోంది. జనాదరణ అధికంగా ఉన్న నేత పవన్ కల్యాణ్ కాబట్టి .. బీజేపీ కన్నా ఎక్కువగా జనసేనకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే బీజేపీలోని కొంత మంది నేతలకు ఇది అసలు ఇష్టం లేదు. కొంత మంది తొలి సంతకాల గురించి కూడా మాట్లాడేస్తున్నారు. పవన్ ను సీఎం అభ్యర్థిగా అంగీకరించడానికి ఇష్టపడటం లేదు.  


పవన్ పేరును వ్యతిరేకిస్తున్న ఏపీ బీజేపీ నేతల్లోని ఓ వర్గం ! 


కేంద్రంలో అదికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో సొంతంగా ఎదిగేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిగ‌ణంలోకి తీసుకోవాల్సి  ఉంద‌నే అభిప్రాయం బీజేపీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతుంది. పార్టీని గ్రామ స్దాయిలోకి తీసుకువెళ్ళ‌టంతో పాటుగా, బ‌ల‌మ‌యిన నాయ‌క‌త్వాన్ని అవ‌స‌రం అయితే ఇత‌ర పార్టీల‌ నుండి నాయ‌కులను  తీసుకురావాల‌నే  ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయ‌ని చెబుత‌న్నారు. ఇప్ప‌టికే కేంద్రంలో పార్టీకి ట‌చ్ లో ఉంటున్న ఇత‌ర పార్టీ నేత‌లు, రాష్ట్రంలో బీజేపికి ఇబ్బందుల‌కు గురి చేస్తున్న విష‌యాల‌ను కూడ ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తావిస్తున్నారు. చేరికలకు ఉంటాయని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. 


గెలిస్తే చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి చేపట్టాలంటున్న మరో వర్గం 


అయితే ఇక్క‌డ మ‌రో ప్ర‌తిపాద‌న కూడ తెర మీద‌కు వ‌చ్చినట్లుగా తెలు్సతోంది.  ఏపీలో రెండు పార్టీలు క‌ల‌సి పోటీ చేసి ఒక వేళ‌ అధికారంలోకి వ‌స్తే తొలి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు జ‌న‌సేన అభ్య‌ర్దిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ని చేసిన ఆ త‌రువాత మిగిలిన రెండు సంవ‌త్స‌రాలు బీజేపి కి చెందిన అభ్య‌ర్దికి అవ‌కాశం ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీద‌కు తెచ్చార‌ని పార్టిలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీని పై ప‌వ‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని కూడ బీజేపి నేత‌లు అంచ‌నా వేసే ప‌నిలో ఉన్నారు.ఎ న్నిక‌ల‌కు ఇంకా రెండు సంవ‌త్స‌రాల కాలం మిగిలి ఉండ‌గానే పొత్తుల పై క్లారిటి కూడా స‌రిగా లేక‌పోయినా అప్పుడే సీఎం ప‌ద‌వి పై బీజేపి నేత‌లు అంచ‌నాలు వేసుకుంటున్నారు.