AP Women Commission chairperson Gajjela Lakshmi : ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జెల వెంకట లక్ష్మి పదవి కాలం పూర్తయిందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అగస్ట్ 26న ఎపి మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ గా పదవీ బాధ్యతలను వాసిరెడ్డి పద్మ స్వీకరించారు. అప్పట్లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవీ కాలం ఐదేళ్లుగా ఉండేది. అంటే పదవీ కాలం 25 ఆగస్ట్ 2024 న ముగిసిపోతుంది. ఎన్నికలకు ముందు వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీని గజ్జల వెంకట లక్ష్మి తో భర్తీ చేశారు. అందుకే ఆమెపదవి కాలం గత ఆగస్ట్ 25తో ముగిసింది అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ తరపున సోషల్ మీడియాలో వీడియోలు చేసే గజ్జెల వెంకట లక్ష్మి అసభ్యమైన భాషలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై విమర్శలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యే ఆమె వీడియోల్లో భాష అత్యంత జుగుప్సాకరంగా ఉంటుందని అటువంటి వారిని మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఎలా చేశారని టీడీపీ నేతలు గతంలో విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ ప్రభుత్వం రాజకీయ వ్యూహంలో భాగంగా వాసిరెడ్డి పద్మతో ఎన్నికలకు ముందు రాజీనామా చేయించి.. గజ్జెల వెంకటలక్ష్మికి పదవి కేటాయించారు. ఇప్పుడా పదవీ కాలం పూర్తయింది.
'అవన్నీ డిలీట్ చేయండి' - మాజీ మంత్రి ఆర్కే రోజు స్ట్రాంగ్ వార్నింగ్
వైసీపీ ప్రభుత్వమే తర్వాత మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవీ కాలాన్ని రెండేళ్లకు కుదిస్తూ అసెంబ్లీలో చట్టం తెచ్చింది. అయితే ఆ తర్వాత చేసే నియామకాలకు ఇది వర్తిస్తుంది. అంతకు ముందు జరిగిన నియామకాల విషయంలో స్పష్టత లేదు. కానీ గజ్జెల వెంకట లక్ష్మిని.. వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన స్థానంలో నియమించడంతో.. ఆ పదవీ కాలం వరకే ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మామూలుగా అయితే ప్రభుత్వం మారగానే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారందరూ రాజీనామా చేస్తారు. కానీ కొన్ని రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న వారు మాత్రం కొనసాగుతున్నాయి.