తిరుమల శ్రీవారు అభిషేక ప్రియుడు. తిరుమలేశుడికి జరిగే కైంకర్యాల్లో అభిషేకానికి చాలా ప్రాధాన్యతం ఉంటుంది. స్వామివారి అభిషేకాల్లో ఉపయోగించేందుకు తేనెను ఏపీ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి కొనుగోలు చేయాలని టీటీడీ తాజాగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు టీటీడీ బోర్డు ఆమోదించింది. అయితే తేనె కొనుగోలుకు ముందు గిరిజన సహకార సంస్థ తేనెను టీటీడీ ల్యాబ్ లలో పరీక్షించింది. 


Also Read: టీటీడీ బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు ! నియామకం చెల్లని హైకోర్టులో పిటిషన్..


తిరుపతి, రాజమండ్రిలో శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు


 ఏపీ అడవుల నుంచి గిరిజనులు సేకరించే తేనెకు తిరుమలేశుడు బ్రాండ్‌ అంబాసిడర్‌ కానున్నారు. ఏడుకొండల స్వామిని అభిషేకించేందుకు గిరిజన తేనెను వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఏపీ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రతిపాదనను టీటీడీ ఆమోదం తెలిపింది. గిరిజన తేనెను టీటీడీ ల్యాబ్‌లలో నాణ్యత పరీక్షలు చేయించింది. మంచి నాణ్యత ఉండడంతో గోవిందుడి అభిషేకానికి గిరిజన తేనె వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. గిరిజనుల నుంచి సేకరించే తేనెను జీసీసీ శుద్ధి చేసి కిలో రూ.298.77 చొప్పున టీటీడీకి అందించనుంది. టీటీడీకి అవసరమైన తేనెను తిరుపతి, రాజమహేంద్రవరం కేంద్రాల్లో శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 


Also Read: దర్శనం టిక్కెట్లు, గదుల బుకింగ్ ఇక ‘జియో’ ద్వారానే.. ఎంవోయూ చేసుకున్న టీటీడీ !


జీసీసీ ఇతర ఉత్పత్తుల కొనుగోలు ప్రతిపాదన


తిరుపతి, రాజమహేంద్రవరం కేంద్రాల్లో రోజుకు 2,500 నుంచి 3000 కిలోల తేనెను శుద్ధిచేసేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. టీటీడీ ఆర్డర్ తర్వాత ఎంత తేనె కావాలనేది నిర్ణయిస్తామని జీసీసీ అధికారులు తెలిపారు. తేనెతోపాటు శ్రీవారి నిత్య కైంకర్యాలకు, నైవేద్యానికి వాడే పసుపు, జీడిపప్పు కూడా జీసీసీ నుంచి కొనుగోలు చేయాలని టీటీడీకి ప్రతిపాదించామని జీసీసీ అధికారులు తెలిపారు. విశాఖ మన్యంలోని పాడేరులో గిరిజనుల నుంచి సేకరిస్తున్న పసుపు మంచి నాణ్యత ఉంటుంది. గిరిజన పసుపు, జీడిపప్పు శాంపిల్స్‌ను జీసీసీ ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి అందించింది. టీటీడీ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తిరుపతితో పాటు మరికొన్ని ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో గిరిజన తేనె, జీడిపప్పు, పసులు ఇతర ఉత్పత్తుల అవుట్ లెట్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. నాణ్యత గల గిరిజన ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగిందని దీంతో వారికి మరింత మేలు కలుగుతుందని భావిస్తున్నారు.


Also Read: టీటీడీ బోర్డులోకి "కేతన్ దేశాయ్" ఎలా ? హైకోర్టు ఆశ్చర్యం.. నోటీసులు జారీ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి