అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం జోలపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అనంతపురం నుంచి కదిరి వెళ్తోన్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు. బత్తలపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. 


Also Read: మాజీ మిస్ తెలంగాణ మరోసారి ఆత్మహత్యాయత్నం... కీసర బ్రిడ్జిపై నుంచి మున్నేరులో దూకిన యువతి


నలుగురు మృతి, చిన్నారికి తీవ్రగాయాలు


చీకటి పడటంతో మృతదేహాలను బయటికి తీయటానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అనంతపురం టు చెన్నై జాతీయ రహదారి కావడంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారు తనకల్లు మండలం రెడ్డివారిపల్లి గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు.  ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.


Also Read: పుట్టింటికి వచ్చిన ఇద్దరు యువతులు.. చివరికి చెరువులో మూడు శవాలు, ఏం జరిగిందంటే..


మృతుల వివరాలు 


కె. మొహమ్మద్ ఆసిఫ్(25), జి. రెడ్డి బాబాజీ, జి.రేష్మా, జి.అమ్మాజ్జీ ఈ ప్రమాదంలో మృతి చెందారు. నలుగురి మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన జి. తస్లిం భాను (4) బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్ నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం సవేరా హాస్పిటల్ కు తరలించారు. 


Also Read: ఇల్లు అద్దెకు తీసుకున్నారు, కొన్నాళ్లకి పాడు పనులు స్టార్ట్.. గుట్టు ఇలా బయటికొచ్చింది


కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి


కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో కింద పడిన ఓ వ్యక్తిని వెనుక నుంచి వస్తున్న బోలోరో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పత్తికొండ నియోజకవర్గంలోని కటారుకొండ గ్రామానికి చెందిన బాలరాజుగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 


Also Read: ఇంట్లో ఒంటరిగా ఆరేళ్ల బాలిక.. లోపలికి వచ్చిన సర్పంచ్ భర్త, చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి