తిరుమల శ్రీవారి సేవలు అన్ని ఇక జియో యాప్‌లో మాత్రమే లభ్యమవుతాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం - జియో సంస్థల మధ్య ఎంవోయూ కుదిరింది. టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమాచారం ఒకే చోట లభించేలా జియో సంస్థ ప్రత్యేకంగా యాప్ తయారు చేస్తుంది.  ఈ యాప్ లో భక్తులకు అవసరమైన దర్శనం టిక్కెట్లు, రూముల బుకింగ్ వంటి సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం యాప్ పని జరుగుతోంది. వైకుంఠ ఏకాదశి రోజు నుంచి యాప్ నుంచి మాత్రమే సేవలు అందించే అవకాశం ఉంది.


Also Read : తాకట్టులో ఆంధ్రప్రదేశ్... జీతాలు, ఫించన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి... ఏపీ సర్కార్ పై పవన్ ట్వీట్ వార్ 


తిరుమల అన్నమయ్య భవన్‌లో ఎంవోయూ కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో అదనపు ఈవో ధర్మారెడ్డి, జియో ప్రతినిధి అనిష్ ఎంఓయు పై సంతకాలు చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేయడంతో ఒకేసారి లక్షల మంది భక్తులు టికెట్ కోసం ప్రయత్నించారని.. దీంతో టీటీడీ సర్వర్లలో సమస్యలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ఈ సమస్యలను అధిగమించి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం టోకెన్లు జారీ చేయడం కోసం జియో సంస్థ ముందుకు వచ్చిందని సుబ్బారెడ్డి చెప్పారు. 


Also Read : విద్యుత్ ట్రూ అప్ చార్జీలపై ఏపీ సర్కార్‌లో గందరగోళం ! నిన్న రద్దు... మళ్లీ వచ్చే నెల నుంచి వసూలు ?


ఇటీవల జియో మార్ట్ ద్వారానే టిక్కెట్ల బుకింగ్‌కు అవకాశం కల్పించారు. జియో క్లౌడ్ టెక్నాలజీ ద్వారా సర్వదర్శనం,  ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేశామని..ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు గంటల లోపు టికెట్ల బుక్ చేసుకున్నారని సుబ్బారెడ్డి ప్రకటించారు. జియో నిర్వహించబోయే యాప్‌లో వసతి, దర్శనం లాంటి అన్ని సేవలు  అందుబాటులో ఉంటాయని టీటీడీ చైర్మన్ చెప్పారు. ఏకాదశి రోజున ఈ యాప్ ను ఆవిష్కరించే ఏర్పాటు చేయాలని చైర్మన్ కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. 


Also Read : అమూల్ ప్రైవేట్ సంస్థ కాదు... పాలు పోసే రైతులే యాజమానులు... వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష


గత ఐదేళ్లుగా టీటీడీకి టీసీఎస్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇప్పుడు కూడా టీసీఎస్ సమన్వయంతోనే జియో సంస్థ ఉచితంగా టీటీడీ ఐటి విభాగానికి మెరుగైన సేవలు అందిస్తుందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జియో మార్ట్ ద్వారా టిక్కెట్లు బుకింగ్‌కు అనుమతించడంపైనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మొత్తం టిక్కెట్లు, గదుల బుకింగ్ జియోకు అప్పగించడం మరింత వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది.


Also Read : నీకు నేనున్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ అభయం, వీడియో వైరల్


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి