పీఆర్సీ జీవోల విడుదల తర్వాత ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్న ఉద్యోగులను కూల్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాల నేతలతో ఉన్నతాధికారులు మరోసారి చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రంలోపు ఓ సారి సీఎస్ సమీర్ శర్మ ప్రెస్‌మీట్ పెట్టి పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేదని.. ఇంకా లాభమేనని వివరణ ఇచ్చే అవకాశం ఉంది. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read: అప్పుడే ఉద్యోగులంతా ఏకమై వ్యతిరేకిస్తే బాగుండేది.. దారుణమైన పీఆర్సీ ప్రకటించారు


అయితే ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తమ కార్యాచరణ ప్రకటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని అనుకుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ఉద్యోగ సంఘ నేతలు ఇక ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ముందుగా పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఆ తర్వాతే  తాము చర్చల గురించి ఆలోచిస్తామని తేల్చి చెబుతున్నారు. 


Also Read: పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదన్న ఏపీ ఉద్యోగ సంఘాలు.. సమ్మెకు సిద్ధమని ప్రకటన !


ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను అత్యంత దారుణంగా మోసం చేసిందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఎంతో సహనంతో తాముప్రభుత్వానికి సహకరించామని కానీ ప్రభుత్వం మాత్రం తమను మోసం చేసిందని అంటున్నారు. మధ్యంతర  భృతి కన్నా తక్కువ ఫిట్‌మెంట్‌కే అంగీకరించినప్పటికీ  హెచ్ఆర్‌ఏలు తగ్గించడమే కాకుండా.. పదేళ్లకోసారి పీఆర్సీ అని ప్రకటించి..భవిష్యత్ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు


హెచ్‌ఆర్‌ఏ విషయంలో ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే జీవోలు జారీ చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. అయితే పండగ ముగిసిన తరవాత హఠాత్తుగా అర్థరాత్రి పూట జీవోలు జారీ కావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. జీతం తగ్గిపోయే అవకాశం ఉండటంతో ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. అవసరం అయితే సమ్మెకైనా వెనుకాడబోమని ఇప్పటికే  హెచ్చరించారు. 


Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.