ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలు మరోసారి ప్రెస్‌మీట్ పెట్టారు. అయితే ఈ సారి వారు ప్రెస్‌మీట్ పెట్టింది ఉద్యోగుల డిమాండ్లను వినిపించడానికి కాదు. మూడు రోజుల కిందట పెట్టిన ప్రెస్‌మీట్‌కు ముందు వచ్చిన ఓ ఫోన్ కాల్ పై వివరణ ఇచ్చేందుకు. ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా, ఉద్యోగుల హక్కుల గురించి నోరెత్తకుండా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వారిని బెదిరించారంటూ మూడు రోజులుగా విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగ సంఘం నేతలు కూడా రాజీపడిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై వివరణ ఇవ్వడానికి ఏపీ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వరర్లు ప్రెస్‌మీట్ పెట్టారు. 


Also Read : జేసీ బ్రదర్స్‌కు చెక్ ! అనంతపురం టీడీపీని చక్కదిద్దేందుకు హైకమాండ్ కీలక నిర్ణయాలు !


మీడియా, సోషల్ మీడియాలో  ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమను బెదిరించలేదని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాకు చెప్పారు. తాము ప్రెస్‌మీట్‌లో ఉండగా సజ్జల ఫోన్ చేసిన మాట నిజమేనన్నారు. అయితే ఆయన బెదిరించలేదని.. శుభాకాంక్షలు మాత్రమే చెప్పారన్నారు. కంట్రోల్‌లో ఉండమని ఆదేశించలేదని..  ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ఘర్షణ ఉండొద్దని సూచించారన్నారు. ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. 


Also Read : పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక తీర్పు... నిర్మాణాలు ఆపాలని కీలక ఆదేశాలు


మూడు రోజుల కిందట ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు .. ఉద్యోగ సంఘం నేతలు మాట్లాడటం ప్రారంభం కాక ముందే ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావుకు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. మైక్‌లో ఆన్‌లో ఉండటంతో  బండి శ్రీనివాసరావు స్పందన మైక్‌లో రికార్డు అయింది. కంట్రోల్‌లోనే ఉంటాం సార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడం సార్ అంటూ ఆయన కవర్ చేసుకున్నారు. ఫోన్ చేసింది సజ్జల అని పక్కన ఉన్న మరో ఉద్యోగ సంఘం నేత బొప్పరాజుకు చెప్పి ఆయనకూ ఫోన్ ఇచ్చారు. ఈ విషయాలన్నీ టీవీల్లో ప్రసారం అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


Also Read : దర్శనం టిక్కెట్లు, గదుల బుకింగ్ ఇక ‘జియో’ ద్వారానే.. ఎంవోయూ చేసుకున్న టీటీడీ !


సెక్రటేరియట్‌లో తమ సమస్యలు చెప్పుకోవడానికి జీతాలు, పెన్షన్లు రాలేదని అడగడానికి సెక్రటేరియట్‌లో ఎవరూ ఉండరని.. తమకు ఒక్క సజ్జల మాత్రమే అందుబాటులో ఉంటారని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామని..  కొంత మందికి ఇంకా జీతాలు, పెన్షన్లు రాని వారు ఉన్నారన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందడం లేదన్నారు. అడుగుదామంటే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కానీ ఎవరూ ఉండరన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే సమస్యలు చెప్పుకుంటామన్నారు. 


Also Read : విద్యుత్ కొరతపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ... యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి