AP DGP Comments :  చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా కుప్పంలో చోటు చేసుకున్న ఘటనలు, దాడులు, ఉద్రిక్తతలు.. శాంతిభద్రతల సమస్య కాదని ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. అవి శాంతిభద్రతలు తగ్గిపోయాయని చెప్పేంత పెద్ద ఘటనలు కాదన్నారు. ఆ ఘటనలో పాల్గొన్న వారంతా స్థానికులేనని.. ఎవరూ బయట నుంచి రాలేదని స్పష్టం చేశారు. పుంగనూరు నుంచి పెద్ద ఎత్తున జనం ఊళ్లలోకి వచ్చారని.. వారంతా గ్రామాల్లోని వారిని భయపెట్టారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కుప్పం  ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు బయట వ్యక్తులను పిలిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే డీజీపీ మాత్రం కుప్పం బయట నుంచి ఎవరూ రాలేదని చెబుతున్నారు. 


కుప్పం ఘర్షణల్లో అందరూ స్థానికులేనని తేల్చిన ఏపీ డీజీపీ 
 
ఆంధ్రప్రదేశ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పెద్దగా మీడియా ముందు కనిపించరు. కీలకమైన ఘటనలు జరిగినా అంతర్గత ఆదేశాలతోనే పని చేస్తూంటారు. అయితే ఇప్పుడు జిల్లాల వారీగా నేర సమీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో పోలీసుల విధులు, కేసులు, లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. కుప్పంలో ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత ..  ప్రతిపక్ష నేత భద్రతలో పోలీసులు విఫలం కావడం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూండటంతో కేంద్రం భద్రత పెంచిందని వస్తున్న వ్యాఖ్యలపై రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు భద్రత పెంచడంమనేది తమ పరిధిలోని అంశం కాదని చెప్పుకొచ్చారు. పోలీసులు తమ విధుల్లో అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు .


YSRCP ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ 5000 ప్రజా పోరు సభలు, అందుకు కమిటీల నియామకం: సోము వీర్రాజు


గంజాయి పంట నివారణకు కఠిన చర్యలు


నేరాలు అదుపు చేయడానికి  ప్రతి నెల నేరాలపై జిల్లాల్లో సమీక్షలు చేస్తున్నామని రాజేంద్రనాథ్ రెడ్డి చెబుతున్నారు.  ఏపీలో జూలై, ఆగస్టు నెలల్లో నేరాల శాతం తగ్గిందన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే టైం స్లాట్ తీసుకుని డేటా విశ్లేషిస్తున్నామని వాటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గంజాయి కట్టడికి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. వైజాగ్ ఏజెన్సీలో గత ఏడాది 7500 ఎకరాల గంజాయి పంటను ధ్వంసం చేశామని.. రైతులు గంజాయి పంటను విడిచి ప్రత్యామ్నాయ పంటలు పండించేలా ప్రోత్సాహించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 


రాజకీయాల్లో ఆ "పవర్" ఏది ? పవన్ కల్యాణ్ పొలిటికల్ సూపర్ స్టార్ ఎప్పుడవుతారు?


గోరంట్ల మాధవ్ వీడియోపై సీఐడీ విచారణ 


వివాదాస్పదమైన ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపైనా డీజీపీ స్పందించారు.   గోరంట్ల మాధవ్ వీడియోపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే ఆ వీడియో వివాదంపై  సీఐడీ విచారణ జరుగుతోందని తెలిపారు. డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ప్రకాశ్ అంశంపై డీజీపీ స్పందించలేదు.