జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  పవన్ కల్యాణ్ అంటే తనకు వ్యక్తిగతంగా ఇష్టమన్నారు. రాజకీయాల్లో కంటే పవన్ కల్యాణ్ కు నటనలో ఎక్కువ మార్కులేస్తాన్నారు. ఆయన సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్ చేసుకుంటే మంచిదని చెప్పారు. రాజకీయాలకు పవన్ పనికిరారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయాలపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓడిపోయాడని ధర్మాన అన్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ జగన్‌తో పోల్చుకోవడం మానుకోవాలన్నారు. అలాగే సీఎం జగన్‌ను విమర్శించే ముందు పవన్, లోకేశ్ ఒకసారి తమ గురించి ఆలోచించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో జరిగిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


Also Read: BH' registration series: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్... కొత్తగా బీహెచ్ సిరీస్.. మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు


జగన్ కి ఎవరు సాటిలేరు


ఏపీలో జగన్‌కు ఎవరూ పోటీలేరని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై సీఎం జగన్ కు స్పష్టమైన అవగాహన ఉందని ఆయన అన్నారు. జగన్ ప్రజల్లో లేరంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరన్నారు. కోవిడ్ సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే నకిలీ స్టాంపుల కుంభకోణం జరిగిందని తెలిపారు. ఈ స్కాంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలను ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమన్నారు. జలాల పంపిణీలో రాష్ట్ర ప్రయోజనాలు వదులుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు.


రెండు చోట్లా ఓటమి


ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ప్రభంజనం సృష్టించాలని ప్రయత్నించారు. ప్రజా సమస్యల కోసం పెద్దఎత్తున పోరాటం కూడా చేశారు. చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని విలీనం చేసినట్టే పవన్ కూడా చేస్తారని చాలా ప్రచారం జరిగింది. కానీ ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. 


 


Also Read: TS Reservation Politics : కేసీఆర్ రెడీ - బండి సంజయ్ సై ! ఇక తెలంగాణ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెరిగినట్లేనా..?


Also Read: AP Home Minster : ఏపీ హోంమంత్రిపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ..! అనర్హతా వేటు పడుతుందా..?