వాహన దారులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాల్సిన అవసరం లేకుండా ‘బీహెచ్‌’ (భారత్‌ రిజిస్ట్రేషన్‌) రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం కింద వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసే అవసరం ఉందడు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఉద్యోగాల రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీని కారణంగా ఇతర రాష్ట్రాల్లో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేకుండా నూతన విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా సులువుగా వెళ్లేందుకు వీలుంటుంది. 


భారత్ సిరీస్ 


ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేయించిన వాహనాన్ని గరిష్ఠంగా 12 నెలల వరకు మాత్రమే వేరే రాష్ట్రంలో ఉపయోగించేందుకు వీలుంటుంది. అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆ రాష్ట్రంలో వాహనం నడపాలంటే వాహనాన్ని మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాలి. దీంతో చాలా మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం బీహెచ్‌ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని వేరే రాష్ట్రంలో నడపాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ మార్చుకోవాలి. ఇకపై రాష్ట్రం మారినా వాహన రిజిస్ట్రేషన్ ను మార్చాల్సిన అవసరం లేకుండా కేంద్రం ఈ చర్యలు చేపట్టంది. ‘భారత్ సిరీస్’ లేదా సింపుల్ గా ‘బీహెచ్’ సిరీస్ కేంద్రం అమల్లోకి తీసుకువచ్చింది. 


ఆర్టీవోకు వెళ్లాల్సిన అవసరం లేదు


వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలోనే ‘బీహెచ్’ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తుంది. ఆర్టీవోకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే బీహెచ్ రిజిస్ట్రేషన్ ను చేసుకోవచ్చని తెలిపింది. రోడ్డు పన్నును మొదట రెండేళ్లకే కట్టొచ్చని లేదంటే వాహన గరిష్ఠ జీవితకాలమైన 15 ఏళ్లకుగానూ రెండేళ్ల చొప్పున మొత్తం ఒకేసారి చెల్లించవచ్చని పేర్కొంది. ఈ కొత్త విధానంతో ఉద్యోగ, వ్యాపార కారణాలతో వేరే రాష్ట్రానికి మారాల్సి వచ్చిన వారికి లబ్ధి జరగనుంది.  


ఏడాది పాటు నడపొచ్చు 


ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని ఇతర రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఏడాది పాటు నడపవచ్చు. ఆ తర్వాత కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించాలి. అందుకు 10 లేదా 12 ఏళ్లకు రోడ్డు పన్నును చెల్లించాలి. మొదటి రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు చెల్లించిన ట్యాక్స్ రీఫండ్ కోసం అంతకుముందున్న రాష్ట్రానికి క్లెయిమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రక్రియను సులభం చేస్తూ కేంద్ర ప్రభుత్వం బీహెచ్ సిరీస్ ను తీసుకొచ్చింది. 


 


Also Read: Bandi Sanjay: భాగ్యలక్ష్మీ గుడి ఎవడి అడ్డా? బీజేపీ పక్కా మతతత్వ పార్టీ.. ఈ యాత్రతో ప్రకంపనలే.. బండి సంజయ్