AP CS Sameer Sarma  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సమీర్ శర్మ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన సేవలు అవసరమని  సీఎం జగన్మోహన్ రెడ్డి సిఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్నిపొడిగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి  లేఖ రాశారు. ముఖ్యమంత్రి  విజ్ణప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం  సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు మాసాల పాటు పొడిగించింది.  అంటే జూన్ ఒకటో తేదీ నుంచి నవంబర్ నెలాఖరు వరకూ ఆయన అదనంగా సీఎస్ పదవిలో ఉంటారు.  డిఓపిటి నుంచి ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఆదేశఆలు అందాయి. 


నారాయణ బెయిల్ రద్దుకు చిత్తూరు కోర్టు నిరాకరణ - అవసరమైతే నోటీసులిచ్చి విచారణ జరపాలని ఆదేశం


వాస్తవానికి సమీర్ శర్మ ఇప్పటికే ఆరు నెలల పొడిగింపులో ఉన్నారు. నవంబరులోనే ఆయన పదవీకాలం ముగియగా ఆరు నెలల పా టు పొడిగించారు. ఆ పొడిగింపు మే నెలాఖరుతో ముగుస్తుంది. సాధారణంగా సీఎ్‌సలకు ఆరు నెలలకు మించి పొడిగింపు ఇవ్వరు. గతంలో సీఎస్‌ నీలం సాహ్నికి మూడు నెలల చొప్పున రెండు విడతలుగా పొడిగింపు ఇచ్చారు. కానీ సమీర్‌ శర్మకు మొదట ఒకేసారి ఆరు నెలలు పొడిగింపు దక్కింది. రెండో సారి మరో ఆరు నెలల పొడిగింపు దక్కించుకున్నారు.  


జీతాల కోసం ఏపీ విద్యుత్ సిబ్బంది పడిగాపులు - ధర్నాలు చేస్తున్న ఉద్యోగులు !


 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ సమీర్‌ శర్మ.. ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పని చేశారు. చాలా కాలం కేంద్ర సర్వీసులోనే ఉన్నారు. ఏపీకి వచ్చే ముందు  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు. రిటైర్మెంట్ రెండు నెలలు ఉందనగా రాష్ట్ర క్యాడర్‌కు వచ్చారు. ఆయనను సీఎస్ చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర సర్వీసుకు తీసుకు వచ్చారు. దానికి తగ్గట్లుగా ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా రిటైరవ్వగానే... సమీర్ శర్మకు చాన్సిచ్చారు. 


గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన రిటైర్మెంట్ గడువు నవంబర్ 30. అంటే రెండు నెలలు మాత్రమే సీఎస్‌గా ఉండాలి. కానీ సీఎం జగన్ ఆయనకు రెండు విడతలుగా ఆరేసి నెలల పాటు పొడిగింపు ఇప్పించడంతో  మరో ఏడాది అదనంగా సర్వీసులో ఉంటున్నారు.