ABP  WhatsApp

Election Results 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Chintan Shivir: మోదీజీ దాని అర్థం ఇదేనా? దేశాన్ని చీల్చడమే భాజపా ధ్యేయం: సోనియా గాంధీ

ABP Desam Updated at: 13 May 2022 05:14 PM (IST)
Edited By: Murali Krishna

Chintan Shivir: మోదీ సర్కార్ పాలనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. మైనార్టీలను భాజపా క్రూరంగా అణచివేస్తుందని ఆరోపించారు.

మోదీజీ దాని అర్థం ఇదేనా? దేశాన్ని చీల్చడమే భాజపా ధ్యేయం: సోనియా గాంధీ

NEXT PREV

Chintan Shivir: రాజస్థాన్ ఉదయ్‌పుర్‌ వేదికగా జరుగుతోన్న కాంగ్రెస్ చింతన్ శిబిర్ వేదికగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. మోదీ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు. మైనార్టీలను భాజపా క్రూరంగా అణిచివేస్తోందని ఆరోపించారు. దేశ ప్రజల్ని భాజపా భయాందోళనకు గురి చేస్తుందన్నారు.



ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన సహచరుల దృష్టిలో 'కనిష్ట ప్రభుత్వం, గరిష్ఠ పాలన' అనే నినాదానికి నిజమైన అర్థం ఏంటో ఇప్పుడే తెలిసింది. దేశంలో విభజనను సృష్టించి, కొందరిని శాశ్వతంగా ఓ వైపునకు చేర్చే విధంగా చేయడం, ప్రజలు నిరంతరం భయం, అభద్రతా భావాలతో జీవించేలా చేయడమే దీని అర్థం. మనదేశంలో సమాన స్థాయి పౌరులు అయిన మైనారిటీలను హింసాత్మకంగా టార్గెట్ చేసి బాధించడం, తరచూ క్రూరంగా హింసించడమే దీని అర్థం. మీరు చేస్తున్నదేంటి? గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మైనార్టీలను భాజపా క్రూరంగా అణిచివేస్తోంది.                                                                            -  సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి


భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ విధానాల ఫలితంగా దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను చర్చించుకోవడానికి 'నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్‌' ఒక అవకాశం కల్పిస్తుందని పార్టీ నేతలను ఉద్దేశించి సోనియా గాంధీ అన్నారు.


ఈ సమావేశాలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా అగ్ర నాయకత్వం తరలివచ్చింది. వీరితో పాటు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బఘేల్ సహా ప్రముఖ నేతలు హాజరయ్యారు.


ఈ సమావేశంలో 400 మంది కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. భాగస్వాముల్లో అత్యధికులు పార్టీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదవులు నిర్వహిస్తున్న లేదా గతంలో నిర్వహించినవారే. అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారు కూడా సమావేశానికి వచ్చారు.


Also Read: Nav Sankalp Chintan Shivir: 'ఒక పార్టీ, ఒకే టికెట్‌'పై కాంగ్రెస్ కీలక నిర్ణయం- హాట్‌హాట్‌గా 'చింతన్ శివిర్' సమావేశం


Also Read: PM Modi: రెండుసార్లు ప్రధానిగా చేశానని సరిపెట్టుకోను- సంతృప్తి పడను: మోదీ

Published at: 13 May 2022 05:14 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.