మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఈ నెల 10న నారాయణ అరెస్టయ్యారు. ఆయనకు  చిత్తూరు నాల్గవ అదనపు జడ్జి బెయిలు మంజూరు చేశారు. టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని, బెయిల్‌ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన చిత్తూరు కోర్టు  వెంటనే బెయిల్ రద్దు చేయాలనే విజ్ఙప్తిని తిరస్కరిస్తూ.... ఈనెల 24వ తేదీన ప్రభుత్వ పిటిషన్ పై విచారణ చేస్తామని పేర్కొంది. ఈలోగా అవసరం అనుకొంటే... నారాయణకు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది నారాయణకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న కేసుపై వాదనలు జరగనున్నాయి.


నారాయణ బెయిల్‌ రద్దు కోసం పైకోర్టుకు వెళ్తాం - సజ్జల ప్రకటన !


లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది నిందితులకు రిమాండ్ విధించడం జరిగిందని, లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రదారుడు నారాయణ కోర్టు మినహాయింపు ఇవ్వడం సరైంది కాదని అడ్వకేట్ సుధాకర్ రెడ్డి న్యాయమూర్తికి వివరించారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే.. చట్టం ముందు అందరూ సమానమేని ఆయన అన్నారు. నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేశామని, iPC 409 సెక్షన్ మాజీ మంత్రి నారాయణకు వర్తించదని మేజిస్ట్రేట్ తెలిపిందన్నారు.


ముందు లీక్, ఆపై మాల్ ప్రాక్టీస్ - అరెస్ట్, మాజీ మంత్రికి బెయిల్, నెక్ట్స్ ఏంటి ?
 
మాజీ మంత్రి బెయిలు రద్దు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, ఏపిపి దుష్యంత్ రెడ్డి, చిత్తూరు జిల్లా కోర్టు ఏపిపి వి.లోకనాధరెడ్డిలను నియమించింది. వీరు ముగ్గురూ చిత్తూరు కోర్టులో గట్టి వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు. ఈ నెల 24 నారాయణ తరపు న్యాయవాదుల వాదనలతో పాటు ప్రభుత్వ లాయర్ల వాదనలను కూడా మరోసారి జిల్లా కోర్టు విననుంది. ఆ వాదనల తర్వాత నారాయణకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలా లేకపోతే.. దిగువకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమేనా అన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. 


కొడుకు వర్థంతి రోజు నారాయణను మానసికంగా వేధిస్తారా ?: టీడీపీ శ్రేణులు ఆగ్రహం


టెన్త్ పరీక్షలు ముగిశాయి. పేపర్ లీకేజీ అయిందని ఓ సారి.. మాల్ ప్రాక్టీస్ జరిగిందని మరోసారి ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగా కేసులు పెట్టి పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు.. ప్రైవేటు టీచర్లను కూడా అరెస్ట్ చేశారు. అయితే నారాయణ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్‌ను అరెస్ట్ చేయడం రాజకీయంగానూ కలకలం రేపింది. ఆయనను జైలుకు తరలించకుండానే బెయిల్ లభించడంతో ప్రభుత్వం మరింత పట్టుదలగా ఆయన బెయిల్‌ను రద్దు చేయించాలని ప్రయత్నిస్తోంది.