సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా రేపు రాష్ట్రంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం జగన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ నుంచి రుణాలు తీసుకొని ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఇళ్లపై పూర్తి హక్కులు కల్పించేందుకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నామని స్పష్టం చేశారు. రుణం ఎంత ఉన్నా ఓటీఎస్ ద్వారా ఉచితంగా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయిస్తోందని చెప్పారు. దీని వల్ల లబ్దిదారులకు ఇళ్లపై సంపూర్ణ హక్కులు వస్తాయన్నారు. ఈ పథకంపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేశాయని విమర్శించారు. అనంతరం టీడీపీ, జనసేనపై మంత్రి కొడాలి విమర్శలు చేశారు. 


వైసీపీకి పవన్ సలహాలేంటి?


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒక రాజకీయ అజ్ఞాని అని మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తేల్చాల్సింది కేంద్రప్రభుత్వమన్నారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకున్నంత మాత్రాన ప్రైవేటీకరణ నిలిచిపోతుందా అని ప్రశ్నించారు. వైసీపీకి సలహాలు ఇచ్చేందుకు సీన్ పవన్‌ లేదన్నారు. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అని పవన్‌ కల్యాణ్‌ కాదన్నారు. పవన్‌ కల్యాణ్‌ బీజేపీ సలహాలు ఇచ్చుకోవచ్చని హితవు పలికారు. 


Also Read: వైఎస్ఆర్‌సీపీ నేతల క్షమాపణలు మాకు అక్కర్లేదు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని నారా భువనేశ్వరి సలహా !


చంద్రబాబుకు సవాల్ 


వైసీపీ నేతలకు పనిలేక ఆడవాళ్లపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. నిజంగా భువనేశ్వరిని కించపరిచినట్లు మాట్లాడితే వాళ్ల పాపాన వాళ్లే పోతారన్నారు. చేయని వ్యాఖ్యలను చేసినట్లు చెప్పిన వాళ్లకు తగలుతాయని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కుట్రలు పన్నడం వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి కొడాలి విమర్శించారు. భార్యను అడ్డంపెట్టుకుని ఎవరైనా రాజకీయాలు చేస్తారా అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తాము చేయని వ్యాఖ్యలు చేశామని ఆరోపించిన చంద్రబాబు అది నిజమని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో అసెంబ్లీలో రోజాను కంటతడి పెట్టించిన విషయం మర్చిపోయారా అని మంత్రి కొడాలి నాని అన్నారు. 


Also Read: షూ పాలిష్ పేరుతో నకిలీ టీ పౌడర్ తయారీ... భారీగా జీడి పిక్కల తుక్కు పట్టివేత...


రైతులకు పూర్తి స్వేచ్ఛ


ధాన్యం కొనుగోళ్ల రగడపై తెలంగాణపై కొడాలి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. అయినా రైతులకు ఏ పంటలు వేసుకోవాలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ఏపీలో ఇప్పటివరకూ 6.5 మెట్రిక్ లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


Also Read:  గుజరాత్‌లో మరోసారి మత్తు భూతం.. పాక్ బోటులో రూ.400 కోట్ల డ్రగ్స్ సీజ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి