BJP Vishnu :  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా మార్పు చేసిన అంశం రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది.   ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరు మార్చిన జగన్.. గుంటూరులోని జిన్నా టవర్ పేరు ఎందుకు మార్చరని ఆయన ప్రశ్నించారు.  వైసీపీ ప్రభుత్వం యన్ టి ఆర్ లాంటి దేశ భక్తులకు అనుకూలమా, దేశ ద్రోహులకి జిన్నా కు అనుకూలమా తేల్చుకోవాలన్నారు. గుంటూరు నడిబొడ్డున జిన్నాటవర్ ఉంటుంది. అది పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా పేరు మీద నిర్మించారు. ఆయనకు సంబంధించినది ఎందుకని పేరు మార్చాలని  బీజేపీ డిమాండ్ చేస్తోంది. 


జిన్నా పేరు మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ససేమిరా !


అయితే ప్రభుత్వం పేరు మార్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పి...జిన్నాటవర్‌కు పటిష్టమైన రక్షణ రక్షణ  ఏర్పాటు చేసింది. అదే సమయంలో భారత జాతీయ పతాకం రంగులు వేశారు. జిన్నా టవర్ పేరు మార్చకుండా రంగులు వేయటం ఏమిటని  విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.  జిన్నా పేరుపై ఎందుకు అభిమానమో చెప్పాలంటున్నారు. అసెంబ్లీలో జరుగుతున్న చర్చల వ్యవహారంపైనా విష్ణువర్దన్ రెడ్డి మండి పడ్డారు. రాష్ట్ర శాసనసభ కార్యక్రమాలతో ప్రజాధనం వృథా తప్ప ప్రజలకు ఉపయోగం లేదు.. ఒక్క ప్రజా సమస్యనైనా ఈ శాసనసభలో చర్చించామని ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వలేక పదవీ విరమణ వయసు  పెంచటం తుగ్లక్ పాలన కాదా అని మండిపడ్డారు.  


ఏపీలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్న విష్ణువర్ధన్ రెడ్డి 


ఏపీలో జగన్ పాలన ప్రజల దృష్టి మరల్చేలా సాగుతోంది..రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలైనా సంతోషంగా లేరన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.  ఏ మంత్రయినా తన శాఖకు సంబంధించి చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి  నెలకోసారి ఓడీ కోసం ఎందుకు పరుగులు పెడుతున్నారో చెప్పాలన్నారు.  పోలీసులు అనారోగ్యానికి గురైతే వారికి రాష్ట్రంలో వైద్య సౌకర్యం అందని పరిస్థితి నెలకొందన్నారు.  రాష్ట్రంలో జగన్ సీఎం అయ్యాక వచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలని వైఎస్ఆర్‌సీపీ నేతలకు సవాల్ చేశారు.  


రాష్ట్ర మంత్రులు తమ శాఖలపై తప్ప అన్నీ మాట్లాడతారన్న విష్ణు


పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన శాఖ గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడతారని.. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని బెదిరించి ఇతర రాష్ట్రాలకు పారిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు.  కేంద్రం రాష్ట్రంలో అభిృద్ధి పనుల ప్రారంభంపై దృష్టి పెట్టింది, అందుకే కేంద్ర మంత్రులు వస్తున్నారన్నారు. కేంద్ర మంత్రులు వస్తున్నా ..  రాష్ట్ర మంత్రులు మాత్రం కేవలం టీవీల ముందు కూర్చుని బూతులు తిట్టడానికే ఉన్నారని..  ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చి జగన్ ప్రజలను వంచించారని మండిపడ్డారు. 


చూస్తూ పోతే జగన్ ఆంధ్రప్రదేశ్ పేరు మారుస్తారు: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల ఫైర్