Vijayasai Reddy Slams Purandeswari: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి (Purandeswari) 'సెలెక్టివ్ అటెన్షన్' (Selective Attention) అనే మానసిక భ్రాంతిలో ఉన్నారని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasaireddy) మండిపడ్డారు. వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నా పట్టించుకోరని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 'పురంధేశ్వరి తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు. ఆమె దృష్టంతా భావ సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడంపైనే ఉంది. పచ్చ పార్టీ ఆరోపణలను నిర్ధారించుకోకుండా రిపీట్ చేయడం వంటివి 'సెలెక్టివ్ అటెన్షన్' లక్షణమే'. అంటూ ట్వీట్ చేశారు.






టీడీపీ 100 సీట్లలోనూ పోటీ కష్టమే


తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడంపై మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి, అనుకూల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే అక్కడ టీడీపీ పోటీ నుంచి తప్పుకొంది. దీన్ని 'జెండా పీకేయడం' అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపీ 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదని ట్వీట్ లో పేర్కొన్నారు.






గత కొంతకాలంగా బీజేపీ నేత పురంధేశ్వరి, వైసీపీ నేతల మధ్య వరుస మాటల యుద్ధం మరింత ముదిరింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ నాటి నుంచి పురందేశ్వరిపై విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి, తాజాగా లిక్కర్ కేసు వ్యవహరంలోనూ ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధించుకున్నారు. ఇటీవలే పురంధేశ్వరి ఏకంగా విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీజేఐకు లేఖ సైతం రాశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వేడెక్కింది. ప్రజల దృష్టి మళ్లించడానికి తప్పుడు ఆరోపణలు చేయడం సరి కాదని పురంధేశ్వరికి విజయసాయి హితవు పలికారు. ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా టీడీపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా, ట్విట్టర్ వేదికగా 'సెలక్టివ్ అటెన్షన్' అంటూ సెటైర్లు వేశారు.


Also Read: Minister Gudivada Amarnath: వీధి బాలలతో కలిసి మంత్రి అమర్‌నాథ్ దీపావళి పండుగ, అనాథలకు టపాసులు