బిగ్ బాస్ షోలో నాగార్జున తన గురించి మాట్లాడిన మాటలపై బిగ్ బాస్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆట సందీప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నుంచి అలాంటి మాటలు వస్తాయని ఊహించలేకపోయానన్నారు. “నాగార్జున నాది బొంగులో డ్యాన్స్ అనగానే చాలా  ఫీల్ అయ్యాను. నాది బొంగులో వ్యక్తిత్వం అన్నా, బొంగులో గేమ్ అన్నా బాధ పడేవాడిని కాదు. డ్యాన్స్ నా ప్రొఫెషన్. బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ లో నాగార్జున గారు నాతో స్టేజి మీద మాట్లాడుతూ.. సందీప్ నువ్వు చాలా మల్టీ టాస్కింగ్ పర్సన్ వి. నవ్వో డ్యాన్సర్ వి, నువ్వో కొరియోగ్రాఫర్ వి, నువ్వో హడ్బెండ్ వి అని చెప్పారు.  ఆయనే మళ్లీ నన్ను నువ్వు డ్యాన్సర్ వా? కొరియోగ్రాఫర్ వా? అని అడిగాడు. నేను అప్పుడు డ్యాన్సర్ ని, కొరియోగ్రాఫర్ ని అని చెప్పాను. వెంటనే ఆయన బొంగులో సమాధానం చెప్పకు అన్నారు. ఆ మాటకు నేను షాక్ అయ్యాను. ఆయనక రెస్పెక్ట్ ఇచ్చి నేనేం మాట్లాడలేదు. సైలెంట్ గా ఉండిపోయాను. ప్రొఫెషన్ ను కాకుండా బొంగులో గేమ్ ఆడావు సందీప్ అన్నా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ, ప్రొఫెషన్ ను అలా అనే సరికి బాధపడ్డాను. నిజానికి నేను మాట పడను. తిరిగి అంటాను. కానీ, నాగార్జున గారికి చెప్పేంత వాడిని కాదు. ఆయన నాలాంటి వాళ్లను ఎంతో మందిని  పైకి తీసుకొచ్చారు. ఆయన ఇచ్చిన అవకాశమే లారెన్స్ మాస్టర్ లాంటి వారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆయన అనాలని కాకపోయినా, ఫ్లోలో అలా అన్నారేమో అనుకున్నాను. అందుకే ఏం మాట్లాడలేదు” అని చెప్పారు.  


వాళ్లను పట్టించుకోలేదు, నన్ను మాత్రమే టార్గెట్ చేశారు- సందీప్


బిగ్ బాస్ హౌస్ లో నాకంటే దారుణమైన మాటలు మాట్లాడినా పట్టించుకోని నాగార్జున తనను మాత్రమే టార్గెట్ చేశారని చెప్పారు. “నేనే కాదు, చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. శివాజీ గారు బొక్కలో బిగ్ బాస్ అన్నారు. గౌతమ్ కూడా జీ.. అనే మాట వాడాడు. భోలే కూడా అలాంటి మాటే అన్నారు. అమర్ పల్లవి ప్రశాంత్​ను ఈ నా కొడుకు అనే పదం వాడాడు. ఈ మాటలన్నీ నాగార్జున పెద్దగా పట్టించుకోలేదు. సింపుల్ గా తీసేశారు” అని చెప్పుకొచ్చారు.


బిగ్ బాస్ షో గురించి నాకు పెద్దగా తెలియదు- సందీప్


“వాస్తవానికి నాకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయం వరకు ఆ షో గురించి పెద్దగా తెలియదు. కేవలం ప్రోమోలు మాత్రమే చూశాను. డ్యాన్స్ షోల గురించి బాగా తెలుసు. కానీ, బిగ్ బాస్ గురించి తెలియదు. నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి అమర్ నాకు కొన్ని హింట్స్ ఇచ్చాడు. అందుకే తనను ఫాలో అయ్యాను. చివరకు ఇలా అయ్యింది” అని సందీప్ చెప్పుకొచ్చారు.


Read Also: వెస్ట్రన్ బీట్​తో తెలంగాణ ఫోక్ - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్ సాంగ్!