మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలను సీబీఐ బయటపెట్టింది. వివేకా డ్రైవర్ దస్తగిరి అఫ్రూవర్ వాగ్మూలంతో హత్య కేసును కీలక మలుపుతిప్పింది. ఈ కేసుపై టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఉత్తమ నటుడిగా వైఎస్సార్ పురస్కారం ఇవ్వాలని ఎద్దేవా చేశారు. పెద్ద నాన్న వివేకా మర్డర్ కి ప్లాన్ చేసిన అవినాష్ రెడ్డే అనుమానాలు ఉన్నాయి, కుట్ర జరిగింది, కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయామంటూ మొసలి కన్నీరు కార్చారని ఆరోపించారు. 






ఆస్తులు కోసం ఇంత దారుణమా...?: అయ్యన్నపాత్రుడు


బాబాయి హత్యకేసులో పురోగతి సాధించలేని సీఎం ఒక ముఖ్యమంత్రేనా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన...ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం వివేకా హత్య వివరాలు తెలుసుకొని ఆశ్చర్యపోయిందన్నారు. వివేకా డ్రైవర్ దస్తగిరి చెప్పిన వివరాలతో అసలు విషయం బయటపడిందన్నారు. బాబాయ్ హత్య జరిగితే ఇది కుట్ర, తెలుగుదేశం వారే చేశారని ఆరోపించిన జగన్.. అధికారంలోకి రాగానే హత్య గురించి ఎందుకు మర్చిపోయారన్నారు. డబ్బుల కోసం, ఆస్తుల కోసం సొంత కుటుంబ సభ్యులనే హత్య చేయడం అన్యాయమన్నారు. 


Also Read:  చాలా అవమానంగా ఉంది... వివేకా హత్య కేసును త్వరగా పరిష్కరించండి... సీబీఐని కోరిన సీఎం మేనమామ


విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలి


వివేకా డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంపై డీజీపీ స్పందించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. హత్య వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని, నిజం నిగ్గు తేల్చాలన్నారు. టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తే ఆధారాలున్నాయా అని నోటీసులు ఇస్తున్న పోలీసులు... ఈ చట్టాలు వైసీపీ నాయకులకు వర్తించవా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. ప్రధానితో మాట్లాడి కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.  హత్య కేసులోని దోషులను శిక్షించాలన్నారు. వివేకా చనిపోయిన రోజున వివేకా గుండెపోటుతో చనిపోయారని, హత్య కాదని ఇచ్చిన స్టేట్ మెంట్ కు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ కేసులో విజయసాయి రెడ్డిని కూడా చేర్చి డీజీపీ చర్యలు తీసుకోవాలని అయ్యన్న డిమాండ్ చేశారు. 


Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జిషీట్ .. కాపీ కావాలని కోర్టులో సునీత పిటిషన్ !


రాజకీయాలతో ముడిపెడుతున్నారు : శ్రీకాంత్ రెడ్డి


ఏపీలో ఏ సంఘటన జరిగినా రాజకీయాలతో ముడిపెడుతున్నారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం గురించి ప్రతిపక్ష పార్టీ ఆలోచించడం లేదన్నారు. వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉన్న జగన్‌ సీబీఐ విచారణ కోరారని గుర్తుచేశారు. కర్ణాటక వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టే సీబీఐ విచారణ కోరారన్నారు. వివేకా గెలుపు కోసం జగన్ కృషి చేశారన్నారు. ఈ ఘటనలో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.


Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన పరిణామం, ఆయన్ను చంపింది అందుకే.. వెనుక బడా నేతలు.. వాంగ్మూలంలో దస్తగిరి వెల్లడి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి