ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఐసీసీ చర్యలు తీసుకుంటోంది. 2024 టీ20 ప్రపంచకప్‌ను అమెరికాలో నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వెస్టిండీస్‌తో కలిసి యూఎస్‌కు ఆతిథ్య హక్కులు కల్పించాలని అనుకుంటోంది. 2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అవకాశం ఉండటంతో ఇలా చేస్తోందని తెలిసింది.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2024ని యూఎస్‌ఏ క్రికెట్‌, క్రికెట్‌ వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించేలా ఐసీసీ పావులు కదుపుతోందని సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ ఓ కథనం ప్రచురించింది. ఇదే జరిగితే 2014 తర్వాత భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వని తొలి టీ20 ప్రపంచకప్‌గా ఇది రికార్డు సృష్టిస్తుంది.


ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీసీఐ సహా అన్ని బోర్డులూ ఇందుకు అంగీకరించడంతో 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో టీ20 మ్యాచులు నిర్వహిస్తారని అంచనా వేస్తున్నారు. 2032 బ్రిస్బేన్‌ ఒలింపిక్స్‌లోనూ చోటిస్తారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడిప్పుడే క్రికెట్‌ అభివృద్ధి చెందుతున్న అమెరికాకు ఆతిథ్య హక్కులు ఇచ్చేందుకు ఐసీసీ చొరవ తీసుకుంటోంది.


2024 టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు తలపడే అవకాశం ఉంది. మ్యాచుల సంఖ్య 55కు పెరగనుంది. ప్రస్తుతం 16 జట్లతోనే మెగాటోర్నీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తలపడుతున్నాయి. మరికొద్ది గంటల్లో విజేత ఎవరో తెలియనుంది.






Also Read: T20 World Cup 2021: మీమ్‌ క్రియేటర్లకు షాక్‌..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!


Also Read: CK Nayudu: 50 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ.. 62 ఏళ్లప్పుడు చివరి మ్యాచ్, క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు ఒక శిఖరం


Also Read: AUS Vs NZ: దుబాయ్ స్టేడియంలో సెంటిమెంట్ ఇదే.. 17 మ్యాచ్‌ల్లో 16 సార్లు.. కేవలం చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే!


Also Read: Shahid Afridi on Virat Kohli: కోహ్లీ అన్నింట్లో కెప్టెన్సీ వదిలేస్తే మంచిది.. రోహిత్‌కు అఫ్రిది మద్దతు


Also Read: Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆ రోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి