ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 45,818 నమూనాలు పరీక్షించగా 629 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కరోనా నుంచి శుక్రవారం 797 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 8,134 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల ప్రకాశంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
Also Read: రెండు డోసులు టీకా వేసుకున్నారా? కానీ బూస్టర్ డోసు తప్పదట!
తెలంగాణలో కొత్తగా 190 కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో 42,166 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీరిలో కొత్తగా 190 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు 6,67,725 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ కొవిడ్ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ కరోనాతో రాష్ట్రంలో 3,929 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 245 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో 4,288 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా కేసులు
భారత్లో కరోనా కేసులు గురువారంతో పోలిస్తే భారీగా తగ్గాయి. తాజాగా 20 వేల దిగువగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 19,740 మందికి కొవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.248 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. శుక్రవారం 23,070 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 206 రోజుల కనిష్ఠానికి చేరింది. శుక్రవారం 12,69,291 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో నిన్న 79,12,202 కొవిడ్టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 93,99,15,323కి చేరింది.
Also Read: ఈ కాంబినేషన్ ఫుడ్స్‌ని పొరపాటున కూడా కలిపి తినకండి... స్లో పాయిజన్ అయ్యే అవకాశం ఉంది