ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 37,744 మంది నమూనాలు పరీక్షించగా 400 మందికి పాజిటివ్ వచ్చింది. నలుగురు కోవిడ్ కారణంగా మరణించారు. కరోనా నుంచి శనివారం 516 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 5,102 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులెటిన్‌లో తెలిపింది. కోవిడ్‌ వల్ల చిత్తూరు, గుంటూరు, కృష్ణ, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: వ్యాక్సినేషన్‌తో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాం: మోదీ






రాష్ట్రంలో 5,102 యాక్టివ్ కేసులు


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,60,682కి చేరింది. వీరిలో 20,41,237 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 516 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 5,102 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,343కు చేరింది. శనివారం ల్ల చిత్తూరు, గుంటూరు, కృష్ణ, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2,92,65,255 నమూనాలను పరీక్షించారు.

 


తెలంగాణలో కొత్తగా 135  కేసులు


తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 26,842 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 135 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,274 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్ తో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 3,947 మంది మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో 168 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,950 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Also Read: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?


కరోనా కొత్త వేరియంట్


ప్రపంచ దేశాల్లో కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాలను మార్చుకుని ప్రపంచ దేశాలను కరోనా భయపెడుతోంది. అయితే తాజాగా యూకేలో వెలుగులోకి వచ్చిన ఏవై. 4.2 హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న వేరియంట్లకు భిన్నంగా అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్‌పై భారత్ కూడా హై అలర్ట్‌లో ఉంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఇది ఊహించనంత వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భారత్‌లో ఇప్పటివరకు ఈ ఏవై. 4.2 వైరస్ గుర్తులు కనబడలేదు. ఇప్పటివరకు 68 వేలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ వేరియంట్ అందులో లేదు. 



"ఈ వేరియంట్‌పై మేం చాలా అప్రమత్తంగా ఉన్నాం. మరిన్ని శాంపిల్స్‌ను పరీక్షిస్తాం. అంతర్జాతీయ ప్రయాణికులపై మరింత దృష్టి పెడతాం. ఈ ఏవై. 4.2 వేరియంట్‌ ఉన్న రోగులను వెంటనే గుర్తిస్తాం."  - నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సీనియర్ అధికారి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి