తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం (అక్టోబర్ 25న) జరగనున్న పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 15న వరంగల్ లో భారీ సభకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు తమ పార్టీ ఘనతపై టీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వరంగల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ విజయవంతంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ వచ్చిందన్నారు.
గత ఏడేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల కలను నెరవేరుస్తూ పాలన కొనసాగిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ ప్లేస్ అయిన వరంగల్‌లో విజయ గర్జన పేరుతో 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమారు 600 ఎకరాల్లో భారీ బహిరంగ సభ కార్యక్రమాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ‘తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ పాలనతో వారి ఆశలు, ఆకాంక్షలు ఒక్కొక్కటిగా కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చుతుంది. పార్టీ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయిన సందర్బంగా భారీ సభను ఏర్పాటుచేస్తున్నాం.
Also Read: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన
తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. దేశంలో ఏ పార్టీ సైతం ఇంత తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందలేదు. టీఆర్ఎస్ పార్టీకి ఆ గౌరవం దక్కింది. రైతులకు సకాలంలో రుణమాఫీ జరుగుతుంది. ఎరువులు, మద్దతు ధర లాంటి సదుపాయాలు కలిస్తున్నాము. రాబోయే 100 ఏళ్ల వరకు తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణం ఇటీవల పూర్తయింది. త్వరలోనే ప్రారంభిస్తామని’ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వివరించారు.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?
టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. కానీ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. ప్రజా క్షేత్రంలో ఉన్న పార్టీలకు మాత్రమే ఆదరణ లభిస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని దాస్యం వినయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.
Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్