ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 40,855 మంది నమూనాలు పరీక్షించగా 396 మందికి పాజిటివ్ వచ్చింది. ఆరుగురు కోవిడ్ కారణంగా మరణించారు. కరోనా నుంచి శుక్రవారం 566 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 5,222 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులెటిన్‌లో తెలిపింది. కోవిడ్‌ వల్ల కృష్ణాలో ఇద్దరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒకరు చొప్పున మరణించారు. 






Also Read: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు


రాష్ట్రంలో 5,222 యాక్టివ్ కేసులు


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,63,177కి చేరింది. వీరిలో 20,43,616 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 566 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 5,222 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,339కు చేరింది. శుక్రవారం కృష్ణాలో ఇద్దరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒకరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2,92,26,511 నమూనాలను పరీక్షించారు. 


Also Read: వ్యాక్సినేషన్‌లో భారత్ 100 కోట్ల మార్క్.. ప్రపంచ దేశాలు షాక్: మోదీ 







తెలంగాణలో కొత్తగా 207  కేసులు


 తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 42,108 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 207 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,70,139కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. శుక్రవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,946కు చేరింది. కరోనా బారి నుంచి 184 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 3,984 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


దేశంలో కరోనా కేసులు


దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 16,326 మందికి కరోనా సోకింది. వైరస్​కారణంగా మరో 666 మంది మరణించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 17,677గా నమోదైంది. శుక్రవారం ఒక్కరోజే 13,64,681 కరోనా​ నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకూ చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 59,84,31,162గా నమోదైంది. కొత్తగా 68,48,417 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,01,30,28,411 టీకా డోసులు పంపిణీ చేశారు. చేరింది. 


Also Read: కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధాని మోదీ భేటీ.. టీకాలపై మరిన్ని పరిశోధనలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి